8, జనవరి 2024, సోమవారం

బాబూజీ స్పష్టీకరణలు - 1


బాబూజీ స్పష్టీకరణలు - 1
 
మనిషి ఆధ్యాత్మిక జీవితంలో సమాధి పాత్ర ఏమిటి? 
మనిషి ఆధ్యాత్మిక వికాసానికి 'సమాధి' అవసరమే లేదు. కావలసినది పరిశుద్ధమైన మనసు. 

కామక్రోధలోభమోహమదమాత్సర్యాల ప్రాముఖ్యతేమిటి?
కామం, క్రోధం మనిషి భగవంతుడు సృష్టించినవి కాబట్టి, ఈ రెండూ మనిషహీ జీవితంలో నుండి తొలగించలేం. కానీ వాటిని క్రమశిక్షణలో ఉంచుకోవచ్చు, క్రమబద్ధం చేసుకోవచ్చు. ఈ రెండూ మనిషి మేధస్సుకు అవసరం. లోభం, మొహం, మనిషి సృష్టించుకున్నవి, కాబట్టి వీటిని సమూలంగా నిర్మూలించుకోవచ్చు. 

ఏ మనిషైనా పరిపూర్ణ సమతౌల్యతను సాధించగలడా? 
పరిపూర్ణ సమతౌల్యత ఏ మనిషిలోనూ సాధ్యం కాదు. ఎందుకంటే సృష్టి జరగడమే సమతౌల్యతకు భంగం కలగడం వల్ల జరిగింది. కానీ ఇంచుమించుగా సమతౌల్యతను సాధించవచ్చు. 

బలహీనులెందుకు బాధపడుతూంటారు?
ఎవ్వరూ తమ సంకల్పశక్తిని వినియోగించుకోపోవడం వల్ల. "నేనెప్పుడూ ఇది చేయగలను అంటాను గాని, ఇది చేయలేను అని ఎప్పుడూ అనను". 

ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి?
ఒక ఖైదీ, ఖైదులో తను  ఖైదీనన్న భావంతో ఉంటాడు. కానీ అక్కడ ఖైదులో పని చేసే అధికారులు కూడా ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం స్వేచ్ఛగా ఉన్నామనే అనుకుంటారు. కాబట్టి, ప్రపంచంలో ఏ విధంగా జీవించేదీ, మన మనస్సు అనుసరించే భావంపై ఆధారపడుంటుంది. 

ప్రకృతి కార్యం నిర్వర్తించడానికి ఈ 'స్పెషల్ పర్సనాలిటీ' ఎప్పుడెప్పుడు అవతరించడం జరుగుతూంటుంది? 
ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఎప్పుడూ ఉంటాడు. సాధారణంగా ఈ వ్యక్తిత్వం కొన్ని వేల సంవత్సరాలకోకసారి వస్తాడనే నమ్మకానికి విరుద్ధంగా, పూజ్య లాలాజీ మహారాజ్ కు చేసిన ప్రార్థనా ఫలితమే - ఇక నుండి ఒక వ్యక్తిత్వం మానవాళికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కానీ ఒక సమయంలో ఒకే వ్యక్తిత్వం అందుబాటులో ఉంటుంది. 

శ్రీరామ చంద్ర మిషన్ సభ్యుడికి గల వరం ఏమిటి?
"శ్రీరామచంద్ర మిషన్ కు చెందిన చిత్తశుద్ధితో సాధన చేసే ప్రతీ సత్సంగీకి (అభ్యాసికి) కనీస అవసరాలు అంటే కూడు, గుడ్డ, నీడ - ఈ మూడిటికి లోటు ఉండదు. (ఇది బాబూజీ ప్రార్థన మేరకు శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అపూర్వ వరం). 

భగవంతుడంటే ఎవరు?
భగవంతుడంటే భగవంతుడే. 

ప్రపంచంలో ఎన్నో పద్ధతులున్నాయి; ఏది సరైనది ఎలా తెలుస్తుంది?
ప్రపంచంలో చాలా పద్ధతులున్నాయి నిజమే. అవి బహుశా సరైనవే కావచ్చు. కానీ సరైనదంటే ఏమిటి అర్థం? ఏ పద్ధతయితే మనలను ఎటువంటి అలజడి లేని స్థితికి తీసుకువెడుతుందో అది సరైనది. ప్రకంపనాలు దివ్యంగా ఉండాలి. ఇదెలా జరుగుతుంది? బరువు తగ్గినప్పుడు; అప్పుడే దాని వెనుక ఉండే సత్యం మనసు ముందుకు వస్తుంది. ఏ పద్ధతయినా ఇటువంటి ఫలితాలనిస్తే, అది సరైనది, శుద్ధమైనది, సహజమైనది. ఇటువంటి స్థితిని అంతరంగంలో కలిగించే పద్ధతిని మీరు ఇన్ని పద్ధతుల్లో అన్వేషించాలి. 






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...