9, జనవరి 2024, మంగళవారం

బాబూజీ స్పష్టీకరణలు - 3

 


బాబూజీ స్పష్టీకరణలు  - 3

What about miracles?
It is not necessary that there should be miracles. Raja Yoga says that very soon the miracles do develop, but we should not try for them.
అద్భుతాలను గురించి మీ అభిప్రాయం? 
అద్భుతాలు అవసరం లేదు. నిజానికి. అద్భుతాలు చేసే అపరిస్థితి త్వరలోనే వస్తుంది కానీ మనం వాటి గురించి ప్రయత్నం చెయ్యకూడదంటుంది రాజయోగం. 
*
Are miracles of any use to humanity?
Miracles are of no use to humanity. The biggest miracle si the transformation of human being.
అద్భుతాల వల్ల మానవాళికి ఏమైనా ప్రయోజనం ఉందా? 
అద్భుతాల వల్ల మానవాళికి ఏ ప్రయోజనమూ లేదు. అన్నిటికంటే పెద్ద అద్భుతం మనిషిలో పరివర్తన రావడమే. 
*
Is there any benefit to people who perform miracles?
Well. They will become famous.
అద్భుతాలు చేసేవాళ్ళకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
ప్రపంచంలో ప్రసిద్ధులవుతారు. 
*
What about Mantra? Do you advise any Mantra?
Normally I do not give any Mantra, but if it is necessary I may do so. But so far I have not found it necessary to do so. You should read the Patanjali Sutras about the Mantra. I think it is the thity second Sutra or something like that. He clearly states that the Mantra, if taken should be taken up only with the bhava or the meaning.
మంత్రం గురించి మీరేమంటారు? మీరు ఏదైనా మంత్రోపదేశం చేస్తారా? 
సాధారణంగా నేను మంత్రం ఇవ్వను, కానీ అవసరమైతే ఇవ్వవచ్చు కూడా. కాని ఇప్పటి వరకూ ఆ అవసరం రాలేదు. మంత్రాన్ని గురించి మీరు పతంజలి ఏమి వ్రాశాడో తన యోగసూత్రాల్లో మీరు చదవాలి; ముప్ఫై రెండవ సూత్రం అనుకుంటాను. అందులో మంత్రాన్ని గురించి స్పష్టంగా వ్రాయడం జరిగింది: మంత్రం తీసుకున్నవాళ్ళు కేవలం దాని భావంపై ధ్యానించాలని చెప్పడం జరిగింది. 
What about Kundalini? Does it play any part in your Yoga?
The Kundalini power, if awakened, is useful for work in the higher worlds. So this power is not necessary for all. There may be just one or two persons for such higher work. Also it is not necessary for spiritual progress.
ఇక కుండలినీ శక్తి గురించి? మీరు చెప్పే యోగాలో దాని పాత్ర ఏమైనా ఉందా? 
కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అది ఉన్నతలోకాల్లో పని చేయడానికి  ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అందరికీ అవసరం లేదు. అటువంటి పనికి కేవలం ఒక్కరో ఇద్దరో అవసరం అవుతారు అంతే. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి దీని అవసరమే లేదు. 
*
I am following another Guru for the last eight months and he has given me a mantra. Can I follow that and also follow your practice?
I must tell you plainly that there cannot be two channels. One may interfere with the other. You may stop one and practice the other for some time and then decide which one you want to follow. I cannot understand why people are reluctant to change the Guru. A Guru is taken for one's own spiritual progress. If he cannot give you what you want then you should seek for another person, of course you should be respectful towards him, but you should tell him that since he cannot give you what you want, you are going to another person.
గత ఎనిమిది మాసాలుగా నేను మరొక గురువును అనుసరిస్తూ ఉన్నాను. ఆయన నాకొక మంత్రం ఇచ్చారు. దాన్ని అనుసరిస్తూ, మీ పద్ధతిని కూడా అనుసరించవచ్చా?
ఉన్నదున్నట్లుగా చెప్పాలంటే రెండు త్రోవలు ఉండటానికి వీల్లేదు. ఒకటి మరొకడానితో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి ఆపేసి, మరొకదాన్ని కొంత కాలం అభ్యాసం చేసి చూడవచ్చు మీరు; ఆ తరువాత మీరు దేన్ని అనుసరించాలో మీరే నిర్ణయించుకోవచ్చు. జనం గురువును మార్చడానికి ఎందుకు వెనుకాడతారో నాకర్థం కాదు; గురువును ఎంపిక చేసుకునేది తన ఆధ్యాత్మిక పురోగతి కోసమే కదా. మీక్కావలసినది ఆయన ఇవ్వలేకపోతే మీరు మరో వ్యక్తిని ఆశ్రయించాలి; అయితే తప్పకుండా ఆయన పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. కానీ నాక్కావలసినది మీరివ్వలేకపోతున్నారు కాబట్టి మరో గురువును ఆశ్రయిస్తున్నానని ఆయనకు చెప్పగలగాలి. 
*

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...