జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం
తెలంగాణాలో
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా
నా ప్రస్థానం - 5
పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనసాగుతూ మహబూబాబాద్ జిల్లా లోని జయ్యారం అనే ఒక చిన్న గ్రామంలో మన ఆశ్రమ నిర్మాణ పనిలో కూడా ఒక చిరు పాత్ర లభించింది.
ఇక్కడ సుమారు 30 అభ్యాసులున్నారు. ఈ కేంద్రం విశేషం ఏమిటంటే వాతావరణం ప్రేమతో నిండి ఉంటుంది. అభ్యాసులందరూ ప్రేమపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఆశ్రమ నిర్మాణ వర్కర్ల పట్ల వీరు కనబరచిన ఆతిథ్యం, ప్రేమ అద్వితీయం. ఈ అభ్యాసులందరూ ఆశ్రమం కోసం, నిర్మాణ లేబర్ తో సమానంగా (నిర్మాణ సమయం అంతా) శ్రమించడం హృదయాన్ని ద్రవించింది. ఇక్కడ చుట్టు-ప్రక్కల ఉన్న అభ్యాసీలు కూడా ఎంతో సహృదయంతో తమ విరాళాలతో సునాయాసంగా ఆశ్రమ నిర్మాణానికి తోడ్పడ్డారు. వీళ్ళు అజ్ఞాతంగా ఉండటానికే ఇష్టపడే అభ్యాసులు. జయ్యారం బృందమే గాక బంగ్లా, ఖమ్మం బృందాలు కూడా గొప్ప సహకారాన్ని అందించారు. 10 మాసాల్లోనే ఈ నిర్మాణం వీళ్ళందరి సహకారంతో చక్కగా తీర్చి దిద్దబడింది. పూజ్య గురుదేవులు రిమోట్ గా సత్సంగాన్ని నిర్వహించి ప్రారంభించడం జరిగింది.
దీని చరిత్ర చాలా ఆసక్తికరమైనది. 1976 లో ఈ గ్రామానికి చెందిన మన ప్రశిక్షకులు, ఉపాధ్యాయులు అయిన కీ.శే. భిక్షమయ్యగారు 15 మంది అభ్యాసులతో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. 1981 లో 436 రూపాయలతో చిన్న భూమి కొనుగోలు చేయడం జరిగింది. జనవరి 10,1983 న పూజ్య బాబూజీ మహారాజ్ ఎంతో కరుణతో ఇక్కడ ఆశ్రమ నిర్మాణానికని 6000 రూపాయలు అనుగ్రహించడం జరిగింది. ఆ భూమిని కొంచెం పెద్దది చేసి ఈ నాడు ఈ ఆశ్రమ నిర్మాణం జనవరి, 2023 లో పునరుద్ధరించబడి, ప్రారంభించబడింది.
ఈ ఆశ్రమ నిర్మాణ క్రమంలో సామరస్యం, పరస్పర గౌరవం, ప్రేమ ఉంటే పనులు ఎంత త్వరగా జరుగుతాయో ప్రత్యక్షంగా నేర్చుకోవడం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి