23, ఫిబ్రవరి 2026, సోమవారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 1

 


కరీంనగర్ ఆశ్రమంలో పూజ్య దాజీ - 2018 
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 1 

శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థలో తెలంగాణా ప్రాంతంలో జోన్-కో ఆర్డినేటర్ గా, ఒక స్వచ్ఛంద సేవకుడిగా,  ఒక దశాబ్ద కాలం పూర్తయ్యింది. తర్వాతి తరం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిన్నటి రోజున లాంఛనంగా నా వారసునికి బాధ్యతలను అప్పగించి వచ్చిన సందర్భాన, తెలంగాణాలో నా ఈ ప్రస్థాన అనుభవాలను, నేర్చుకున్న అంశాలను, పూజ్య గురుదేవుల అదృశ్య అభయ హస్తం, బాహ్యాంతరంగాల ద్వారా వారి నుండి అందిన  మార్గదర్శనం, వారు వర్షించిన కృపను, వారి పట్ల అపార కృతజ్ఞతతో ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.  

2016 లో నాతోపాటు నా మరో సన్నిహిత సోదరుడైన డా. సాయి రామ్ ను ఒకేసారి పిలిచి ఈ బాధ్యతలను, మాకు పూజ్య డాజేఏయే స్వయంగా కాన్హా శాంతి వనంలో  తెలియజేయడం జరిగింది. ఇరువురికీ ఒకే రకమైన సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలి ఇలా ఉన్నాయి:  "మీరిద్దరూ బాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వెళ్ళిన ప్రతీ చోట ఉన్న అభయాసులను సాధ్యమైనంత వరకూ ప్రతీ ఒక్కరితో పరిచయం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వినమ్రంగా ఉంటూ మీ పనులు మీరు చెయ్యండి. చేస్తారా?" అని ప్రశ్నించారు. "మీరు కేప్పింది చెప్పినట్లే చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం అన్నాం మేము. ఆ విధంగా మా  ఈ జోన్-కో ఆర్డినేటర్ ప్రస్థానం ప్రారంభమయ్యింది.

దాజీ గదిలో నుండి బయటకు రాగానే, ఉత్సాహం బాగానే ఉంది కానీ, నా గుండెల్లో ఒకరకమైన  దిగులు బయల్దేరింది. పని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా తిరగాలి? మాట అయితే ఇచ్చేసాము గాని ఈ ప్రశ్నలు ఒక్కసారిగా కమ్మేసి కొంచెం గందరగోళంలో పడేలా చేశాయి. అక్కడే నాకు ఆదర్శ సోదరుల్లో ఒకరైన మధు కొత్తపల్లి గారు ఎదురయ్యారు. ఆయన స్థానంలోనే నేను పని చేయబోయేది కాబట్టి, భయ్యా, మీరే నాకు సాయం చేయాలి, అన్నాను.  దానికి వారు, "పిచ్చోడివా కృష్ణా, సాక్షాత్తు ఆయనను కలసి వచ్చి నా సహాయం కోరుతున్నావేంటి ?" అన్నారు.  ఒక్కసారిగా నాలో ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పారు. ఆ క్షణం నేనెప్పుడూ మరచిపోలేను. ఆ వాక్యం నాలో ధర్యం నింపడమే గాక, మధు గారికి తన గురువుపై ఉన్న అపార విశ్వాసాన్ని చూసి నాలో నా గురువుపై గల విశ్వాసం మరో దశకు చేరుకుంది; మధు గారిపై నా గౌరవం ఎన్నో రేట్లు పెరిగిపోయింది. 

 ఆ తరువాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసింది లేదు, అధైర్య పడింది లేదు. ఆత్మ విశ్వాసం, గురుదేవులపై గురి నూతన శిఖరాలకు చేరుకున్నట్లనిపించింది. 
(సశేషం .... )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 1

  కరీంనగర్ ఆశ్రమంలో పూజ్య దాజీ - 2018  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 1  శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థలో తెల...