7, అక్టోబర్ 2026, బుధవారం

చైతన్య వికాసమే మానవ పరిణామం


చైతన్య వికాసమే మానవ పరిణామం 

 పరిణామం చెందడమే మానవ జీవిత ప్రయోజనం. మానవ పరిణామం చైతన్య వికాసం వల్లే సాధ్యం. ఈ దిశగానే మానవ మనుగడ కొనసాగాలి. ఆధ్యాత్మిక ప్రక్రియలు లేక యౌగిక ప్రక్రియలు సాధకులు ప్రయత్నపూర్వకంగా, సంపూర్ణ ఎరుకతో, సంపూర్ణణ స్పృహతో ఈ దిశగా ప్రయత్నించే సాధనాలు. 

దీనిని మరింత వివరంగా పూజ్య దాజీ బోధనల వెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 


అసలు చైతన్యము లేక చేతన అంటే ఏమిటి?

మానవ శరీర వ్యవస్థలో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని మూడు శరీరాలుంటాయన్నది మనకు విదితమే. యోగశాస్త్రం ప్రకారం అనేక సూక్ష్మ శరీరాలున్నప్పటికీ ప్రధానమైనవి నాలుగు - చిత్, అహం, బుద్ధి, మనసు. సంస్కృతంలో చేతనను చిత్ అంటారు. ఈ చేతననఊ ఆకాశంతో పోలుస్తారు. చిదాకాశం అని కూడా సంబోధిస్తారు. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు, ఇతర అంతరిక్ష వస్తువులు యే విధంగా నిక్షిప్తమై ఉన్నాయో, అహం, బుద్ధి, మనసు అనే ఈ మూడు సూక్ష్మ శరీరాలు చేతనలో  ఇమిడి ఉన్నాయి. ఈ మూడు శుద్ధమైనప్పుడే, చేతన మారుతుంది. చేతన మారితేనే మనిషి పరివర్తన చెందుతాడు. 


చైతన్యం అంటే పూజ్య దాజీ ఇచ్చిన నిర్వచనం - ఎంత ఎరుక ఉన్నది, ఎరుకలో లేనిది ఎంత ఉంది, ఈ రెండూ కలిపితే చేతన అవుతుంది. దీన్ని బట్టే మనిషిలో వికాసం ఉంటుంది. 


ప్రతీ మనిషికీ అందుబాటులో ఉండే చేతన కొంత ఉంటుంది. దాన్ని ఒక సన్నని పొరగా భావించమని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. ఈ పొరకు పైన అధిచేతనం అనే ఆకాశం ఉంటే, అడుగున ఉపచేతనం అనే మహాసాగరం ఉంది. మధ్యలో ఈ సన్నని పొర ఉంది. దీని వెడల్పు ఇరు దిశలా పెరగడమే, విస్తరించడమే చైతన్య వికాసం. (పైన చిత్రంలో చూడండి). 


హార్ట్ఫుల్నెస్ యౌగిక సాధన వల్ల చైతన్య వికాసం 

హార్ట్ఫుల్నెస్ ధ్యానం వల్ల మనోబుద్ధ్యహంకారచిత్తాలు శుద్ధి జరిగి అధిచేతన అనే ఆకాశంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. 

హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ లేక శుద్ధీకరణ ప్రక్రియ వల్ల ఉపచేతనంలో ఉండే మాలినాలు, వికారాలు తొలగిపోయి ఉపచేతన అనే మహాసాగర లోలోతుల్లోకి చేరుకునే అవకాశం ఉంటుంది. 

హార్ట్ఫుల్నెస్ ప్రార్థన అనే యౌగిక ప్రక్రియ ద్వారా అందుబాటులోని ఎరుక కూడా వెలుగులోకి వచ్చి చేతన మరింత విస్తృతంగా వికాసం చెందుతుంది. 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

చైతన్య వికాసమే మానవ పరిణామం

చైతన్య వికాసమే మానవ పరిణామం    పరిణామం చెందడమే  మానవ జీవిత ప్రయోజనం . మానవ పరిణామం చైతన్య వికాసం వల్లే సాధ్యం. ఈ దిశగానే మానవ మనుగడ కొనసాగాల...