28, అక్టోబర్ 2026, బుధవారం

ఛాదస్తం

 

ఛాదస్తం 

మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడుతూ ఉంటాం కూడా. వీటిని గుర్తిస్తే కానీ వాటిని తొలగించే ప్రయత్నం కానీ, అధిగమించే ప్రయత్నం గాని మనం చేయం. మనకు తెలియకుండానే మన మనుగడకు ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డు పడుతూ ఉంటాయి. 

అటువంటి ఛాదస్తానికి సంబంధించిన కథ ఒకటుంది. ఒక ఊళ్ళో, గుడిలో ఒక పూజారి ఉండేవాడు. ఆయన క్రమం తప్పకుండా గుడిలోని దేవతకు అర్చక ధర్మాలన్నీ నిర్వర్తిస్తూ సేవాలనందిస్తూ ఉండేవాడు. స్వామికి కైంకర్యాలన్నీ పూర్తయిన తరువాత గర్భగుడి బయటకు వచ్చి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇది ఆయన అలవాటు. ఆయనకు పొట్ట పెద్దగా ఉండటం వల్ల ఆయన అలా నమస్కారం చేస్తున్నప్పుడు, ఆయన పంచే యొక్క గోచి ఊడిపోతూ ఉండేది. నమస్కారం చేసినప్పుడల్లా ఊడిపోవడం మళ్ళీ ఆయన గోచీ పెట్టుకోవడం; మరలా నమస్కారం పెట్టడం, మరలా అది ఊడిపోవడం, మళ్ళా పెట్టుకోవడం ఇలా ప్రతి రోజూ 3 సార్లూ జరుగుతూ ఉండేది. ఇది ఆ పూజారి కొడుకు గమనిస్తూ ఉండేవాడు. 

ఒక రోజు ఆ పూజారి గారు పరమపదించడం వల్ల ఆయన కొడుకు ఆ పూజారి స్థానాన్ని గ్రహించాడు. ఇతను కూడా తన తండ్రిలాగే అన్నీ విధులు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఆఖరున తన తండ్రిగారిలాగానే 3 సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ఉండేవాడు. అయితే ఇతనికి తన తండ్రిగారికి ఉన్నట్లు అంతా పొట్ట లేకపోవడం వల్ల ఆతని పంచె గోచీ ఊడేది కాదు. అందుకని అతను ఆ గోచీ ఊడదీసి 3 సార్లూ మళ్ళీ పెట్టుకుంటూ ఉండేవాడు. ఇదీ ఛాదస్తం అంటే. ఆలోచన లేకుండా, మనం ఉన్న కాలమాన పరిస్థితులకు వర్తిస్తుందా లేదా అన్న వివేకం లేకుండా చేసే పనులే ఛాదస్తాలంటే. వీటిని గుర్తించి అతి శీఘ్రంగా తొలగించుకునే ప్రయత్నంలో ఉండాలి మనం. లేదా అవి తరతరాలకు మనకు తెలియకుండానే వ్యాపిస్తాయి.   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఛాదస్తం

  ఛాదస్తం   మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడ...