కూపస్థ మండూకం - బావిలో కప్ప
కూపస్థ మండూకం (బావిలో కప్ప) అనే నానుడి అందరూ విన్నదే. ఓక బావిలో ఒక కప్ప ఉండేదట. దానికి ఆ బావే లోకం. మరో ప్రపంచం దానికి తెలియదు. దానికి పోటీ కూడా ఎవ్వరూ లేరు. ఆ బావికి ఆ కప్పే రాజు. అటువంటి బావిలోకి, ఒక సముద్రపు కప్ప ఒకటి వచ్చి చేరింది ఎలాగో. ఆ సముద్రపు కప్పను చూడగానే,
మన బావిలో కప్పకి అభద్రతా భావం ఏర్పడి, "నువ్వెక్కడి నుండి వచ్చావు?" అని సముద్రపు కప్పను ప్రశ్నిస్తుంది.
దానికి ఆ సముద్రపు కప్ప "నేను సముద్రం నుండి వచ్చాను" అని జవాబిస్తుంది.
అప్పుడు మన బావిలోని కప్ప "సముద్రమా? అదెలా ఉంటుంది?" "మీ సముద్రం మా బావి అంతా ఉంటుందా?" అంటూ బావిలోని ఒక అంచు నుండి మరో అంచుకు దూకుతుంది.
అప్పుడు సముద్రపు కప్ప బావిలో కప్పకు సముద్రం ఎలా ఉంటుందో ఏమి చెప్తే అర్థం అవుతుంది?
మన మానవుల పరిస్థితి కూడా అదే. ఎవరికి వారు తమ లోకమే చాలా గొప్పదంటూ జీవిస్తూ ఉంటాం. ఇక్కడ సముద్రపు కప్ప అంటే గురువు (అనంతం నుండి మన కోసం దిగి వచ్చినవాడు) ఆయన ఎక్కడి నుండి వచ్చాడో చెప్పడం గాకుండాగా నెమ్మది-నెమ్మదిగా మన వేగానికి తగినట్లుగా ఆ ఆనంటానికి తీసుకువెళ్ళ గలిగే సమర్థుడు గురువు. అదీ గురువు పరిస్థితి.
కాబట్టి గురువును సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, ఆ గమ్యస్థానానికి వెళ్ళే వరకూ అసాధ్యమే బహుశా. అందుకే గురువు అడుగుజాడల్లో వెళ్ళడానికి మన లోకమే చాలా గొప్పదనుకోకుండా మన దృక్పథాలు అనేక రకాలుగా వికాసించాలని గురువు (సముద్రపు కప్ప) మన వద్దకు వస్తాడు.
ఈ మర్మాన్ని గ్రహించి సాధకులందరూ గురువు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి సంసిద్ధులగూడూరుగాక.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి