బాబూజీ చెప్పిన 7 శ్లోకాలు, పూజ్య దాజీ ద్వారా వెల్లడియైన 7 శ్లోకాలు 7 రత్నాలు:
శ్లోకం 1
ప్రజాహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనాతుష్ఠః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. //2:55//
ఓ పార్థా, మనసులో ఉద్భవించే
కోరికలన్నిటినీ ఎవరైతే త్యజిస్తాడో, ఆత్మసంతృప్తి
కలిగి ఉంటాడో, ఆత్మలో సంతుష్ఠుడై అంతరంగంలో స్థిరంగా ఉంటాడో అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.
శ్లోకం 2
ధ్యాయతో విషయాంపుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోపిజాయతే. //2:62//
ఇంద్రియాలపైనే దృష్టిని సారించినవాడు వాటికి ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ
నుండి కోరిక పుడుతుంది; కోరిక నుండే కోపం
పుడుతుంది.
శ్లోకం 3
క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి. //2:63//
కోపం మనసును గందరగోళానికి గురి చేసి భ్రమకు లోనవుతుంది; ఫలితంగా జ్ఞాపక
శక్తి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనమవడంతో మనిషి
అథోగతిపాలవుతాడు.
శ్లోకం 4
రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైః చరన్
యైఃఆత్మవశైః విధేయాత్మా విధేయాత్మాప్రసాదమధిగచ్ఛతి. //2:64//
మనసును అదుపులో ఉంచుకున్నవాడు రాగద్వేషాల (ఇష్టాయిష్టాల)నుండి
ఇంద్రియములతో వస్తువులను వినియోగిస్తున్నప్పటికీ వాటి నుండి
విముక్తుడవుతాడు;భగవదనుగ్రహాన్ని పొందుతున్నాడు.
శ్లోకం 5
నాస్తి బుద్ధిరుక్తస్య న చా యుక్తస్య భావనా
భావనాన చా భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్. //2:66//
సామరస్యం లేనిదే మనిషికి విజ్ఞత ఉండదు; సామరస్యం లేకుండా ధ్యానం
కుదరదు; ధ్యానించకుండా శాంతి రాదు. మనశ్శాంతి లేనప్పుడు మనిషికి
సంతోషం ఎక్కడుంటుంది?
శ్లోకం 6
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః //3:35//
పరధర్మాన్ని ఎంతబాగా నిర్వర్తించినప్పటికీ గుణము లేనిదైనా స్వధర్మమే
మేలు; పరధర్మాన్ని నిర్వహించడం కంటే కూడా స్వధర్మం ఆచరిస్తూ మృత్యువు
సంభవించినా మంచిదే.
క్లుప్తంగా చెప్పలంటే, “నీ పని నువ్వు
చూసుకో” అని అనుండేవారు బాబూజీ.
శ్లోకం 7
నకర్మణామనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్నన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్ఛతి. //3:04//
కర్మ చేయకుండా ఉండటం వల్ల మనిషికి కర్మ నుండి విముక్తి కలగదు. కేవలం
కర్మ పరిత్యాగం వల్ల పరిపూర్ణతను సాధించడం కుదరదు.
(సశేషం)
అద్భుతంగా ఉంది
రిప్లయితొలగించండిVery nice collection.
రిప్లయితొలగించండిChala bagundhi.
Thank you
గురుదేవులు యెడల మీ భక్తి, ప్రేమ, మీరు చేసే ప్రయత్నం - అద్భుతం, అందరికీ మార్గదర్శకం. మీ తపన యత్నం గమనిస్తే నాకా 2 విషయాల్ని గుర్తొస్తూ ఉంటాయి: 1. ప్రజ్ఞానాం బ్రహ్మ - విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమే నీవు (మానవులు)
రిప్లయితొలగించండి2. బద్ధకం, అలసత్వం ఎంతమాత్రం పనికిరావని, ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, చురుకుగా ఉండాలనే పెద్దలు మాటలు గుర్తుకొస్తాయి.
🙏
May your effort culminate in achieving your highest aspiration.🙏
రిప్లయితొలగించండిExlent
రిప్లయితొలగించండిచాలా బాగుంది. acharinchali������
రిప్లయితొలగించండిబాగుంది
రిప్లయితొలగించండిEcellent slokas
రిప్లయితొలగించండిPranams Daaji regular reciting these shlokas will be eye opening
రిప్లయితొలగించండి