21, నవంబర్ 2021, ఆదివారం

గీతాహృదయం 3 - దాజీ వెల్లడించిన మరో 3 శ్లోకాలు



                         


శ్రీకృష్ణ  భగవానుడు   ఏడు  రత్నాలు అందించిన ఆ తరువాత మొదటి రోజు  
యుద్ధం పూర్తయిన తరువాత అర్జునుడిని భగవానుడు ఓదారుస్తూ మూడు వ్యక్తిగత 
రహస్యాలను వెల్లడించడం  జరిగింది:

రహస్యం 1

యదా యదా హి  ధర్మస్య గ్లానిర్భవతి  భారత 

అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 4:7॥ 

 తాత్పర్యం: ధర్మానికి ఎప్పుడు  కలుగుతుందో, ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో ఓ అర్జునా, అప్పుడు నేను ఈ భూమ్మీద అవతరిస్తూ ఉంటాను. 

రహస్యం 2

 పరిత్రాణాయ  సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 4:8॥

 తాత్పర్యం:శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని

 స్థాపించడం కోసం నేను భూమిపై మళ్ళీ  మళ్ళీ అవతరిస్తూ ఉంటాను.

రహస్యం 3

ఇది  చాలా ముఖ్యమైన శ్లోకం,  18వ  అధ్యాయంలోనిది, 66వ  శ్లోకం:

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం  వ్రజ

అహం త్వా  సర్వపాపేభ్యో మోక్షయిష్యామి  మా  శుచః 18 :66॥ 

తాత్పర్యం: అన్ని ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు వేడినట్లయితే, నీ  సమస్త పాపాల నుండి విముక్తిని కలిగిస్తాను; భయపడకు. 

ఈ ఏడు  రత్నాలను,  ఈ  మూడు  రహస్యాలను  తరువాయి  భాగాల్లో  అధ్యయనం  చేసే  ప్రయత్నం  చేద్దాం. 

(సశేషం)


2 కామెంట్‌లు:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...