5) సేవ
సేవ అనేది హృదయ లోలోతుల్లో నుండి పెల్లుబికేటువంటి భావం; మనిషి తనను గురించి గాక ఇతరులను గురించి త్రికరణశుద్ధిగా ఆలోచించే సందర్భం. ఈ నిజమైన సేవాభావం మనిషిలో భగవంతుని పట్ల గాని, గురువు పట్ల గాని లేక వ్యక్తిత్వాల ప్రేరణల కారణంగా మనసులో కృతజ్ఞత ఏర్పడటం వల్ల కలుగుతుంది. అటువంటి సేవ మనిషికి నిజమైన ఆఅనందాన్ని కలిగిస్తుంది. క్రమక్రమంగా దీనికి మించిన ఆనందం మరొకటి లేదని అర్థమవుతుంది. సేవించడమే జీవితపరమార్థమని అనుభవంలో తెలుస్తుంది. అప్పుడు స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన వాక్కులు మనసుకెక్కుతాయి: They only live who live for others, others are more dead than alive. అన్నాడు ఆ మహానుభావుడు. అంటే ఇతరుల కోసం జీవించేవారే నిజంగా జీవిస్తున్నట్లు, తక్కినవారు జీవిస్తున్నారనడం కంటే మృతులతో సమానమనే చెప్పాలి.
నిజమైన సేవ ఏ విధంగా ఉండాలి?
నిజమైన సేవ స్వార్థరహితమైనదై ఉండాలి. ఎటువంటి ప్రతిఫలమూ ఆశించరానిదై ఉండాలి - ధనము గాని, గుర్తింపు గాని, గౌరవం గాని, ప్రశంసలు గాని ఇత్యాదివి ఏ విధంగానూ మన మనసులో లేకుండా అందించేదే నిజమైన సేవ.
హార్ట్ఫుల్నెస్ గురువుల ప్రకారం, ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టడం, బట్టల్లేనివారికి బట్టలివ్వడం, దాహంగా ఉన్నవారికి నీరు ఇవ్వడం, డబ్బు లేనివారికి డబ్బివ్వడం, బలహీనులకు బలం ఇవ్వడం, విద్యలేనివారికి విద్యనందించడం ఇటువంటివన్నీ సేవ క్రిందకు రావని చెప్తారు. ఇవన్నీ మన తోటి సోదరసోదరీమణులకు చెయ్యవలసిన ధర్మ, కర్తవ్యం అంటారు.
చాలా మంది పైన విధంగా సేవ చేయడం మానవ సేవ అనుకుంటారు. ఇటువంటి మానవ సేవ మాధవ సేవ అనుకుంటారు. భక్త పోతన చలనచిత్రంలో ఎటువంటి మానవ సేవ మాధవ సేవ అనేది చక్కగా ఒక గేయరూపంలో చెప్పడం జరిగింది. ఒక చరణం ఇలా ఉంటుంది: ... భోగభాగ్యముల రోసి, ఆడంబరము తెగత్రోసి, అహము మమత త్యాగము చేసి, తనువు ధనము హరిపరముగ చేసే మానవ సేవ మాధవ సేవ... అని ఉంటుంది ఆ చరణం.
మానవ జీవితం ఆ భగవంతుని పట్ల లేక ఈ జీవితపరమార్థాన్ని తెలియజేసినటువంటి గురువు పట్ల కలిగిన కృతజ్ఞత యొక్క అభివ్యక్తీకరణ అయిపోవాలి; వారి పట్ల క్రమక్రమంంగా ఏరపడెటువంటి సంపూర్ణ శరణాగతి యొక్క అభివ్యక్తీకరణ అవ్వాలి.
🙏
రిప్లయితొలగించండిPranams to Master
రిప్లయితొలగించండి