18, నవంబర్ 2026, బుధవారం

దీపావళి సందేశం - పూజ్య దాజీ

 



దీపావళి సందేశం  - పూజ్య దాజీ 

పూజ్య దాజీ నవంబర్ 8, 2026, ఆదివారం దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ తన సందేశంలో మూడు ప్రధాన అంశాలు ప్రస్తావించడం జరిగింది.

1) మాస్టర్లను ఒకరితో నొకరిని పోల్చడం మానుకోమని అందరినీ హెచ్చరించారు. 

2) అభ్యాసులు ప్రిసెప్టర్లను ఆరాధించరాదని, కేవలం గౌరవించాలని నొక్కి చెప్పడం జరిగింది. 

ఒక సోదరి దాజీకి ఉత్తరం వ్రాస్తూ భోపాల్ కు చెందిన ఒకానొక ప్రిసెప్టర్ తనకు బాబూజీతో నేరుగా సంపర్కం ఉందని, దాజీ ప్రయాణాల్లో ఆయనను ఆదేశాల మేరకు సంరక్షణ కల్పింఛేది కూడా ఆతనేనని అమాయకులైన అభ్యాసులను మోసగిస్తున్నాడని ఉల్లేఖించడం జరిగింది. ఇది దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ప్రిసెప్టర్లను అస్సలు నమ్మరాదని, ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఇవ్వాలని ప్రిసెప్టర్లను హెచ్చరించారు.

మనం మూలాన్నే ఆరాధించం, మాస్టర్లనే ఆరాధించం.   

3) అభ్యాసులతో కలిసి వ్యాపారం చేయవద్దని, దీని వల్ల ఆధ్యాత్మిక సాధనకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

వ్యాపారం అన్నాక లాభాలుంటాయి, నష్టాలుంటాయి, అభిప్రాయ బేధాలుంటాయి, విభేదాలుంటాయి ఇంకా అనేక వడూడూడుకులుంటాయి. వీటన్నిటికీ సిద్ధమయ్యే వ్యాపారం చేయాలి తప్ప పరస్పర సంబంధాలు పాడైపోయి, జీవిత ప్రయోజనం అయిన ఆధ్యాత్మిక సాధనకు దూరమవడం మంచిది కాదని చెప్పడం జరిగింది. 

అభ్యాసులు పరస్పరం ధన సహాయం చేసుకోవాలంటే కూడా ఎంత ఇస్తే తిరిగి రాకపోయినా ఫర్వాలేదో అంతా మాత్రమే ఇవ్వమన్నారు. 

దీపావళి సందేశం - పూజ్య దాజీ

  దీపావళి సందేశం  - పూజ్య దాజీ  పూజ్య దాజీ నవంబర్ 8, 2026, ఆదివారం దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ తన సందేశంల...