జైపూర్ - తెలంగాణా ఆశ్రమంలో పూజ్య దాజీతో
తెలంగాణాలో
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా
నా ప్రస్థానం - 2
తెలంగాణా అభ్యాసులు సరళస్వభావులు, మర్యాద-గౌరవం గలవారు, ఆతిథ్యం ఎంతో ప్రేమతో చేస్తారు, ఆత్మగౌరవం మెండుగా గలవారు, దైవం పట్ల మంచి సహజంగానే నమ్మిక గలవారు, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపిస్తే నిండుగా నిబద్ధతతో నిర్వహిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో పని చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. నేను చెప్పినవాటికి నిదర్శనం ఇక్కడ మన సంస్థ యొక్క స్వంత ఆశ్రమాల సంఖ్యే. హైదరాబాదులో నాలుగు (దోమల్ గుడా, బి. హెచ్. ఈ. ఎల్. రామచంద్రాపురం, తూముకుంట, కాన్హా శాంతి వనం) ఆశ్రమాలు గాక, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలవంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, జయ్యారం, నల్గొండ, మిర్యాలగూడా, పెద్దపల్లి, ఆదిలాబాద్, చిత్తనూర్, అమరచింత, మందమర్రి, భద్రాచలం, అశ్వాపురం, గోపాల్రావుపేట్ (కరీంనగర్ వద్ద), భూపాలపల్లి, గోదావరిఖని, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మహబూబ్ నగర్, ఇలా ఇంచుమించు 20 ఆశ్రమాలకు పైగా సందర్శించడం జరిగింది. ఇవిగాక అనేక కేంద్రాలు - గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ సందర్శించడం జరిగింది. కొన్ని కొత్త కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. నూతన ప్రశిక్షకులను అవసరమైన చోట, సహజ్ మార్గ్ వ్యాప్తి కోసం గురుదేవులకు సిఫార్సు చేసే అవకాశం కలిగింది. అలాగే సెంటర్ కో-ఆర్డినేటర్లను, జోన్ కో-ఆర్డినేటర్లను, సిఫార్సు చేసే అవకాశం కూడా కలిగింది. అన్నీ కేంద్రాల్లోనూ అభ్యాసుల సహకారం, ఆప్యాయతలు సంపూర్ణంగా లభించాయి. ఎప్పటికప్పుడు పూజ్య గురుదేవులకు రిపోర్టులు పంపించడం జరుగుతూ ఉండేది. ఇవి గాక, అభ్యాసులకు ప్రేరణాదాయకమైన శిక్షణా కార్యక్రమాలు, అలాగే ప్రశిక్షకులకు తెలుగులో ప్రిసెప్టర్ వర్క్ గురించిన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ ప్రిసెప్టర్ వర్క్ గురించిన కార్యక్రమాన్ని పూజ్య గురుదేవుల అనుమతితో ఒకసారి కరీంనగర్ లోనూ, ఒకసారి ఒంగోలు కేంద్రంలోనూ, ఒకసారి జూమ్ కాల్ ద్వారానూ కూడా నిర్వహించే అవకాశం లభించింది.
(సశేషం .... )
తెలంగాణ లో మీ సేవలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కొన్ని సార్లు నాకు లభించింది. మిషన్ పని లో మీ కృషి, శ్రమ మా అందరికీ ఆదర్శనీయం. మీ స్తాయిలో మేము కూడా కృషి చేసే సామర్థ్యం, క్రమశిక్షణ మరియు dedication మాకు లభించాలని కోరుకుంటున్నాము. మీకు మరియు మీరు సేవలు అందించడానికి సహకరించిన మీ కుటుంబ సభ్యులకు మాస్టర్ గారి ఆశీస్సులు అన్నీ వేళల లభిస్తాయి.
రిప్లయితొలగించండి