తెలంగాణా గ్రామాల్లో ధ్యానం
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6
భారత దేశ గ్రామాల్లో ధ్యానం పరిచయం చేసే సౌభాగ్యం మనందరికీ గురుదేవుల దయ వల్ల కలుగుతూ ఉంది. అది ఒక చక్కని అనుభూతి. పైన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. ఇందులో మాట్లాడుతున్నవాళ్ళందరూ ధ్యానం సాధన చేస్తున్న మన అభ్యాసులే. ఈ వీడియో మన గురుదేవులైన పూజ్య దాజీకి బాగా నచ్చిన వీడియో.
ఆయా గ్రామాల సర్పంచ్ ల సహాయంతో లేక మన అభ్యాసుల సహాయంతో అక్కడ ప్రవేశించి అనేక గ్రామాల్లో 3 రోజుల గ్రామ-ధ్యానోత్సవాలు నిర్వహించడం కొనసాగుతూ ఉంది. ఒక గుడిలోనో లేక బడిలోనో లేక గ్రామ పంచాయితీ కేంద్రంలోనో లేక గ్రామ గ్రంథాలయంలోనో నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్ని కేంద్రాలలో సాధన చక్కగా కొనసాగిస్తున్నారు కూడా; అటువంటి చోట మన పరాశిక్షకులు తమ సేవలు అందిస్తున్నారు కూడా.
నేను నిర్వహించిన మొట్టమొదటి గ్రామం కరీంనగర్ జిల్లాలోనో హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజజూపల్లిలో ధ్యానోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. హనుమంతుడి గుడిలో నిర్వహించాం. ఇప్పటికీ ఆ కేంద్రం కొనసాగుతూ ఉంది.
ఆ తరువాత అనేక గ్రామాల్లో ఈ గ్రామ-ధ్యాయణోత్సవాలు నిర్వహించడం జరిగింది. కుల, జాతి, మత బేధం లేకుండా ఆసక్తి గలవారందరికీ ఈ ధ్యానాన్ని పరిచయం చేయగలగడం మన గొప్ప అదృష్టం. మనిషి చేయగల ఉత్కృష్ట సేవ మనిషి హృదయానికి ప్రశాంతత, మనసును స్థిరంగా చేయడమే గదా. అది మన ధ్యానం ఎటువంటి నేపథ్యం నుండి వచ్చినవారికైనా తేలికగా అందిస్తుంది.
మన గ్రామాలన్నీ సాధ్యమైనంత త్వరగా ధ్యానమయమవ్వాలని అందరూ ప్రార్థిద్దాం, కృషి చేద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి