29, జనవరి 2024, సోమవారం

ఒక నూతన మానవాళి - దాజీ

 


ఒక నూతన మానవాళి - దాజీ 

ఆదివారం, జనవరి 28, 2024 - కాన్హా శాంతి వనం 
అందరికీ నమస్తే. 
మనం ఒక గొప్ప నూతన ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం; ఆ ఉత్సవం మన గురుపరంపరలోని మాస్టర్లు గంటున్న ఒక నూతన మానవాళి అనే కలను బలపరచడానికి అవసరమైన ప్రేరణను కలిగించబోతోంది. ఇలా మానవరూపంలో ఈ ఖైదులో  కొనసాగడానికి వీల్లేదు. అతీతంగా మానవీయంగా తయారవ్వాలి; ఆ తరువాతి మెట్టు ఏమిటో అప్పటికే తెలిసిపోతుంది. అంటే దివ్యంగా తయారవడం అనేది వారి బాధ్యత అవుతుంది.  (గురుపరంపరది). అంటే కాదు, దివ్యత్వాన్ని కూడా దాటి పరమ పరిపూర్ణ స్థితికి చేరుస్తామని కూడా మన గురుపరంపర వాగ్దానం చేయడం జరిగింది. ఇదీ మన హార్ట్ఫుల్నెస్ విధానంలో జరిగే సహాజమార్గ యాత్ర.
బాబూజీ ఇలా అంటున్నారు: దాని కోసం సంసిద్ధులవడానికి చిత్తశుద్ధిగల, తమలో పరివర్తన కలగాలని పరితపించే ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరూ కూడా ఆనందంగా, పరమానందంగా ఆధ్యాత్మికతను వ్యాపింపజేసే దూతలుగా మరింత ఉత్సాహంగా తీవ్ర నిష్ఠతో పాల్గొందురుగాక. 
మనం ఈ విధంగా ప్రారంభిద్దాం: శ్రద్ధాసక్తులతో, అతిగా అలసిపోయేంతగా, తమను తాము ఇబ్బందిపెట్టుకోకుండా, సాధ్యమైనంతగా తమను తాము మార్చుకోవాలన్న తపన కలిగిన అభ్యాసులు, భండారాకు ముందు, ఈ రోజుతో మొదలుకొని,  ప్రిసెప్టర్ల నుండి ముఖాముఖి తీసుకోవడం మంచిది.ఈ రోజు ఒక సిట్టింగు, రేపు రెండు సిట్టింగులు, ఇలా కొనసాగించండి. భాండారాలో కూడా సిట్టింగులు తీసుకోవడం కొనసాగించవచ్చు. ఎన్ని సిట్టింగులాయినా తీసుకోవచ్చు; కానీ అలసిపోయేంతగా అవసరం లేదు. రోజుకి ఒకటో రెండో సిట్టింగులు చాలు; ఒక్కొక్కటి కేవలం అరగంటసేపు మాత్రమే. 
ఈ పని చేసే ముందు, మీ అంతరంగా ఆధ్యాత్మిక స్థితిని, ఉద్వేగస్థితిని  పరిశీలించుకోండి. అంటే కాదు, మీకున్న బాధలనీ, కష్టాలనీ బాబూజీ తన భుజస్కంధాలపై ఉంచేయమంటున్నారు. మీ బాధలనీ, కష్టాలనీ నేను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు; నాకిచ్చేయండి అంటున్నారు; అన్నిటి నుండీ విడుదలైపోమమంటున్నారు, బాబూజీ. 
కానీ అది ఎలా చేస్తారు? "బాబూజీ, ఈ సమస్యలన్నీ మీవి" అన్నంత తేలికా? అవును తేలికే. ప్రయత్నించి చూడండి, ఏమి జరుగుతుందో. 
ఈ సందేశం నన్ను పరవశింపజేసింది. అదే వారి ఉదారత, అదే వారి వాగ్దానం కూడా. ధన్యవాదాలు. 












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...