18, జనవరి 2024, గురువారం

బాబూజీ స్పష్టీకరణలు - 10

 


బాబూజీ స్పష్టీకరణలు - 10 

How universal love can be achieved?
The real thing is to transfer all love to God. Remembrance of one brings remembrance of all. If I love you, I love your children also. There is a society which has been preaching Universal love for the last 40 years, but there is no success. Why? It is because of hatred in the heart. Remove hatred and love will develop by itself. So you should not work on it, but on its base.
విశ్వసౌభ్రాతృత్వం సాధించాలంటే ఎలా?
అసలు విషయం ఏమిటంటే మన ప్రేమనంతటినీ భగవంతునిపై బదిలీ చేయాలి. ఒకరిని స్మరిస్తే అందరూ స్మరణలోకి వస్తారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తే, మీ పిల్లలను కూడా ప్రేమిస్తాను.  గత 40 సంవత్సరాలుగా ఒక సంస్థ విశ్వమానవ ప్రేమను బోధిస్తూ ఉంది, కానీ సఫలం కాలేదు. ఎందుకని? హృదయంలో ద్వేషం ఉండటం వల్ల. ద్వేషాన్ని తొలగించేస్తే ప్రేమ తనంతతానుగా పెంపొందుతుంది. కాబట్టి దాని మీద పని చేయడం కాదు, దాని మూలం మీద పని చెయ్యాలి.  
*
What is the purpose of human being, of human existence?
The purpose is only Realisation, or to realise one's own nature which is Divine.
మనిషి ప్రయోజనం ఏమిటి, మనిషి అస్తిత్వం యొక్క ప్రయోజనం ఏమిటి? 
సాక్షాత్కారమే అసలు ప్రయోజనం. తన నిజ స్వభావమైన దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకోవాడమే మనిషి ప్రయోజనం 
*
What is life?
Well, there are many definitions. But I tell my own definition. Life in life is the real life. 
జీవితం అంటే ఏమిటి?
చాలా నిర్వచనాలున్నాయి కానీ నేను నా స్వంత నిర్వకహనం చెప్తాను. జీవంలో జీవమే నిజమైన జీవితం. 
*
The words "Freedom" and "to be free", what do they mean?
Freedom is when you are free from freedom. Yes, the real freedom is when you are free from freedom.
"విముక్తి", "స్వేచ్ఛగా ఉండటం" వీటి అర్థం ఏమిటి?
విముక్తి నుండి విడుదలవడమే విముక్తి. అవును, నిజమైన విముక్తి అంటే మీరు విముక్తి నుండి విడుదలవడమే. 
*
What is the moral of man? 
To think of higher things - that is the moral of man. When you think of it you will also have it. Try for it. I feel that civilisation in all countries must be modified withing 10 years. Can you tell me what is the greatest foolishness of man? I will tell you. We always think of the past but forget to build the future. That is our great foolishness.
మనిషి యొక్క నీతి ఏమిటి?
ఉన్నత విషయాలను గురించి ఆలోచించడం - అదే మనిషి యొక్క నీతి. ఆలోచిస్తే దాన్ని పొందుతారు కూడా. ప్రయత్నించండి. రానున్న 10 సంవత్సరాలలో నాగరికత మారబోతోంది. మనిషిలో ఉండే అతి పెద్ద మూర్ఖత్వం ఏమిటో చెప్పగలరా? నేను చెప్తాను. ఎప్పుడూ గతాన్ని గురించే ఆలోచిస్తూ భవిష్యత్తును నిర్మాణం చేసుకోపోవడం. అదే మనలో ఉండే గొప్ప మూర్ఖత్వం. 
*
Are will and desire different?
Desire at its own place is bad, but if it is properly moulded it is good. We are using desire wrongly. Will is the process to obtain the object of desire.
సంకల్పము, కోరిక - రెండూ వేర్వేరా? 
కోరిక తన స్థానంలో చూస్తే చెడడదే, కానీ దాని సక్రమంగా మాలచుకోగలిగితే మంచిదే అవుతుంది. మనం కోరికను తప్పుడు విధంగా ఉపయోగిస్తున్నాం. కోరికను నెరవేర్చుకునే ప్రక్రియను సంకల్పం అంటారు.  
*
What is wisdom?
It is the proper utlisation of the power of God.
విజ్ఞత అంటే ఏమిటి? 
దైవశక్తిని సక్రమంగా వినియోగించడమే విజ్ఞత. 
*
What is your opinion about Sannyasa?
Sannayasa is not necessary. 
సన్న్యాసంపై మీ అభిప్రాయం? 
సన్న్యాసం అవసరం లేదు. 
*
Master, what about eating?
I am giving you a cooperative reply. I allow it till you can stop these things.
మాస్టర్, మాంసాహారం సంగతేమిటి?
మీకు సహకరించే సమాధానం ఇస్తాను. మీరు ఆపగలిగే వరకూ అనుమతినిస్తున్నాను. 
*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...