బాబూజీ ఉద్యోగ పర్వం
జనవరి 1925 వ సంవత్సరంలో సహాజహానుపూర్ జడ్జీ కోర్టులో, గుమాస్తాగా చేరి, 1956 లో రికార్డు కీపర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఉత్తరభారతదేశంలో గుమాస్తానీ 'బాబు" అంటారు. అందుకే రామచంద్ర 'బాబూజీ' అయ్యారు. 'జీ' అంటే గౌరవ సూచకం.
బాబూజీ నిజాయితీని, సమగ్రమైన సౌశీల్యాన్ని, పనిత్యనాన్ని చూసి, ఉన్నతాధికారులందరూ సంతోషించేవారు. ఆయన పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. తోటి గుమాస్తాలతో వారి ప్రవర్తన అసాధారణమైన మంచితనంతో కూడి ఉండేది.
బాబూజీ ఎప్పుడూ తన స్వలాభం కంటే న్యాయానికి ఉన్నత స్థానం ఇచ్చేవారు. ఉదాహరణకు, వారి సహోద్యోగికి రావలసిన ప్రమోషన్ బాబూజీకి ఇచ్చారు. అప్పుడా ఉద్యోగి తన సీనియారిటీని, ఉద్యోగం భర్తీ అయిన తేదీ నుండి గణించాలనీ, ఆ విధంగా చూసినట్లయితే, ప్రమోషన్ తనకే రావాలని అర్జీ పెట్టుకున్నాడు. బాబూజీ అంటే మక్కువా, సదభిప్రాయము ఉన్న ఉన్నతాధికారులు బాబూజీని పిలిచి అభిప్రాయం అడుగుతారు. ఆ ప్రమోషన్ వల్ల ఆయనకు గణనీయమైన లాభం ఉన్నా కూడా, అర్జీ పెట్టుకున్న ఆ ఉద్యోగయికే ఆ ప్రమోషన్ దక్కడమే న్యాయం అని బాబూజీ చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ ఉద్యోగికి ప్రమోషన్ ఇస్తారు. అప్పటి నుండి బాబూజీ అంటే ఆ ఉద్యోగికి అమితమైన గౌరవం ఏర్పడుతుంది.
వారికేదైనా సమస్య వస్తే, క్రింద నుండి పై అధికారుల వరకూ అందరూ వారికి సహకరించేవారు. బాబూజీ యేదైనా వ్రాస్తే, అధికారులు చదవకుండానే నిస్సంకోచంగా సంతకాలు పెట్టేసేవారు. బాబూజీ కూడా చాలా జాగ్రత్తగా, విశ్వాసంతో డ్రాఫ్టు చేసేవారు.
బాబూజీ తనకు ద్రోహం తలపెట్టిన వ్యక్తి పట్ల కూడా ఎటువంటి శతృత్వం లేకుండా, అతనితో ఎప్పటిలాగే అందరితో ప్రవర్తించినట్లే వ్యవహరిస్తూండేవారు. నిజానికి ఆ వ్యక్తి పట్ల ప్రేమ కూడా ఉండేది. "ఎవరైనా వారి ధర్మం వారు నిర్వహించకపోతే, నేను వారి పట్ల నిర్వహించవలసిన ధర్మాన్ని ఎందుకు విస్మరించాలి?" అన్న సిద్ధాంతం వారిది.
నేను మీ పట్ల చేస్తున్నది నా ధర్మం, మీరు నా పట్ల ఏమి చేయడం లేదో అది మీ ధర్మం - అని అంటూండేవారు బాబూజీ. దీన్ని అనేకరకాలుగా అర్థం చేసుకోవాలి.
"ఎవరైనా ఏదైనా మేలు చేస్తే, ఆ ఋణం తీర్చుకోడానికి ప్రయత్నించేవాడిని. కానీ పొందిన మేలుకు నేనెంతగా తిరిగి చేసినా, ఆ ఋణం అలాగే ఉంటుంది" అని అనుకునే స్వభావం బాబూజీది.
బాబూజీపై ఉన్నతాధికారులు వారి సచ్ఛీలతను గురించి అధికారిక పుస్తకాలలో వ్రాసినవి ఈ విధంగా ఉన్నాయి:
"ఆయన పనితనం నాకు పూర్తిగా సంతృప్తినిచ్చింది. ఆయన నెమ్మదిగా ఉండే వ్యక్తి. పని చాలా బాగా చేస్తాడు."
"ఇతను చాలా సమర్థుడు; శ్రమజీవి. అతని పని నాకు సంతృప్తికరంగా ఉంది. అతనిలో నిజాయితీ, మంచి పేరు, అసూయ కలిగించేంతగా ఉన్నాయి."
"రికార్డు కీపర్ గా అతను చేసిన పని చాలా సంతృప్తికరంగా ఉంది. అతను శ్రమజీవి, జాగ్రత్తగా పని చేసే వ్యక్తి. అతనికి మంచి నిజాయితీపరుడని పేరు కూడా ఉంది."
"సమర్థుడు, నిగర్వి, నిజాయితీపరుడన్న పేరు గలవాడు."
"సాధుజీవనం అంటే విశ్వాసం గలవాడు. అంతేగాక ఈ సూత్రాన్ని అధికారిక జీవనంలో కూడా అమలు జరిపిన వ్యక్తి."
"నిగర్వి, నిశ్శబ్దంగా పని చేసుకుపోయే ఉద్యోగి. సాధుజీవనం గడిపే పేరున్న వ్యక్తి."
"ఇతను సాధుజీవనం గడుపుతూ, నిత్యజీవిత వ్యవహారాలలో కూడా ఉన్నతమైన సిద్ధాంతాలకు బద్ధుడై జీవించేవాడు. రికార్డు కీపర్ గా తన కర్తవ్యాలన్నీ తెలిసినవాడు. రికార్డు రూమును, సక్రమంగా ఉంచడంలో సమర్థుడు. అతని పని నాకు పూర్తిగా సంతృప్తినిచ్చింది."
పదవీ విరమణ సమయంలో, "ఇతరుల్లో అసూయమ కలిగించేమతగా నిజాయితీ, క్రమశిక్షణ గలవాడని పేరు సంపాదించిన వ్యక్తి. చాలా జాగ్రత్తగా అస్సలు గర్వం లేకుండా పని చేసేవారు. మిగిలిన సిబ్బందికి వారు ఒక ఆదర్శ ఉద్యోగి అని చెప్పాలి. వారి పదవీ విరమణ, సిబ్బందిలో తీరని లోటును కలిగిస్తుంది."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి