24, జనవరి 2024, బుధవారం

బాబూజీ ఇల్లు - వాతావరణం


బాబూజీ ఇల్లు - వాతావరణం 

బాబూజీ ఇల్లు ఉత్తర ప్రదేశ్ లోని, షాజహానుపూర్ ఊరు చివర కేరు గంజ్, మోహల్లా దివాన్ జోగ్ రాజ్ అనే ప్రాంతంలో ఉంది. బాబూజీ పూర్వీకులది జమీందారి కుటుంబం. ఆ ఇంటికి ఎత్తైన ప్రహరీ ఉండేది. 

బాబూజీ ఇంటి ద్వారంలోకి ప్రవేశించగానే వాతావరణ మారిపోయి చాలా ప్రత్యేకంగా ఉండేది. ద్వారం బయటి వాతావరణానికి, లోపల వాతావరణానికి గల వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించేది. వచ్చినవారు ఎంత సున్నితస్వభావులైతే, అంతా స్పష్టంగా ఈ వాతావరణాన్ని అనుభూతి చెందేవారు. "ఈ వాతావరణ ఇలా ఉండటానికి కారణం కేవలం లాలాజీ అనుగ్రహమే. ఇటువంటి వాతావరణంలో ఆధ్యాత్మికంగా ఎవరైనా తవారగా ఎదగగలరు" అని అంటూండేవారు బాబూజీ. "ప్రతీ అభ్యాసి ఈ వాతావరణం తాను ఎక్కడికి వేడితే అక్కడ తన చుట్టూ సృష్టించుకోవాలి. అప్పుడు బాహ్యమైన ఆలోచనలు గాని, పరిసరాల ప్రభావం గాని, మనలను స్పర్శించలేవు. ఇది ఒక కవచంలా కాపాడుతుంది" అని కూడా అనేవారు బాబూజీ. 

ఆ వాతావరణాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్లిపోయే సమయంలో ప్రతీ హృదయంలోనూ తెలియని ఆవేదన, విరహాబాధ కలిగి అమదరూ చిన్నపిల్లల్లా కంటనీరు పెట్టుకునేవారు. అభ్యాసులకు బాబూజీతో ఎంత స్వల్పకాల సంబంధమైనా సరే, అందరూ ఈ విధంగా అనుభూతి చెందినవారే. అందరికీ వారి నిజమైన నివాసం ఆదేనన్న భావం కలుగుతూ ఉండేది. 

"అభ్యసికి మాస్టరుతో మానవ సంబంధం కలిగిన క్షణం నుండి ఆ సాధకునిపై మాస్టర్ పని ప్రారంభమవుతుంది" అని అంటూండేవారు చారీజీ. 



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీమదాంధ్ర మహాభాగవతం - బమ్మెర పోతన

  శ్రీమదాంధ్ర మహాభాగవతం - బమ్మెర పోతన  * ఎ వ్వ నిచే జనించు జగము; యె వ్వని లోపల నుండు లీనమై; యె వ్వ ని యందు డిందు; పర మే శ్వరుడెవ్వఁడు; మూలకా...