22, జనవరి 2024, సోమవారం

అనంత శ్రీరామ తత్త్వ ధ్యానం

 




అనంత శ్రీరామ తత్త్వ ధ్యానం 

అయోధ్యలో 5 శతాబ్దాల తరువాత శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ శుభసందర్భాన, భారతదేశమే గాక సకల విశ్వమూ రాముని ధ్యాసలో నిమగ్నమైన తరుణంలో, మర్యాదా -పురుషోత్తం రామ్ అని పిలవబడే శ్రీరామచంద్రుని, రామో విగ్రహవాన్ ధర్మః అన్న శ్రీరాముని అపూర్వమైన, అమేయమైన, అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని, సనాతనమైన శ్రీరామ తత్త్వాన్ని   ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 
శ్రీరాముని తత్త్వాన్ని, ఆయన సద్గుణాలను, వ్యక్తిత్వాన్ని, ధర్మనిష్ఠను, ఆయన స్థితప్రజ్ఞత్వాన్ని, అన్నిపరిస్థితుల్లోనూ తన మానసిక సంతులనాన్ని కోల్పోకుండా ఆ సమత్వ స్థితిలో ఉండటాన్ని, క్షమ, కరుణ ఇత్యాది గుణాలను,  ప్రాణ ప్రతిష్ఠ కంటే కూడా, ప్రాణాహుతి సహాయంతో ధ్యానించడం ద్వారా మనలో అలవడే   అవకాశం ఉందంటున్నారు మన పూజ్య గురుదేవులు దాజీ. 
శ్రీరాముడు పితృవాక్య పరిపాలనా దక్షుడైన ఒక తనయుడిగా, తన రాజ్యంలో పరిపూర్ణ సామరస్యం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టిన అపూర్వ చక్రవర్తిగా, పరిపాలకుడిగా,  శత్రువును కూడా క్షమించి అక్కున జేర్చుకోగలిగిన విశాల హృదయుడిగా, ఒక ఆదర్శ భర్తగా, తండ్రిగా, అన్నగా ఇలా అన్నీ పాత్రల్లోనూ ఆదర్శంగా ఉండినటువంటి లక్షణాలను మనం ధ్యానం ద్వారానే మన చేతనలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు దాజీ. ప్రధానంగా హార్ట్ఫుల్నెస్  యౌగిక ప్రక్రియలు ఆధునిక మానవులకు, ఈ సంసార సాగరాన్ని తేలికగా ఈదడానికి, జీవిత పరమార్థాన్ని సాధించడానికి, యథార్థ జీవిత గమ్యాన్ని చేరుకోడానికి, అందరికీ అవసరమయ్యే ఈ సద్గుణాలను సరళంగా అందుబాటులోకి తీసుకు వస్తాయంటారు మన మాస్టర్లు. ప్రతీ పౌరుడూ రాముడిలా ఉన్నప్పుడే అందరూ కోరుకునే రామరాజ్యం సాధ్యపడుతుంది. నిజమైన అర్థంలో ఆ దిశగానే మన హార్ట్ఫుల్నెస్ ఉద్యమం తన వంతు కృషి కొనసాగిస్తున్నది। 
వారి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని, వారిలోని దివ్యత్వానికి తోడ్పడిన యోగవాసిష్ఠం, (దీన్నే వశిష్ఠ సంహిత అని కూడా అంటారు)  శ్రీరాముడు స్వయంగా బోధించిన రామగీత, ప్రతీ సాధకుడూ అధ్యయనం చేయవలసిన, మనకు అందుబాటులో ఉన్న ఉద్గ్రంథాలు.  
సంపూర్ణ ప్రయత్నం చేసి చూద్దాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...