16, జనవరి 2024, మంగళవారం

బాబూజీ స్పష్టీకరణలు - 8

 


బాబూజీ స్పష్టీకరణలు - 8 

What is Transmission?
Transmission is the utilisation of the Divine power for the transformation of man.
ప్రాణాహుతి ప్రసరణ అంటే ఏమిటి?
ప్రాణాహుతి అంటే దివ్యశక్తిని మనిషిలో రావలసిన పరివర్తన కోసం వినియోగించడం.
*
How does the transmission work on you?
You mean on myself? Well, in myself it brings me to the balanced state of mind. Unbalanced character is lost. These are the effects of the transmission. 
ప్రాణాహుతి మీపై ఎలా పని చేస్తుంది?
మీ ఉద్దేశం నా మీదా? నాలో మనసులో ఒక సమతౌల్యస్థితిని కలిగిస్తుంది. సమత్వం లేని స్వభావాన్ని పోగొడుతుంది. ప్రాణాహుతి ప్రభావాలు ఇవే. 
*
Can you feel it?
Yes, if we are sensitive we can feel it. And suppose you do not feel it, the changes that occur will convince you of the effects of the transmission. 
దీన్ని మీరు అనుభూతి చెందగలరా?
మనకు సున్నితస్వభావం ఉంటే తప్పక అనుభూతి చెందగళం. ఒకవేళ అనుభూతి పొడలేకపోతే, మీలో సంభవించే మార్పుల ద్వారా ఈ ప్రాణాహుతి ప్రభావాలను గుర్తించగలుగుతారు. 
*
What is egoism?
Egoism is not a bad thing. Really speaking it is a pointer. It points to some thing. Now here is a table and I lift it up. I can lift it because of the egoistic power in me which tells me I can lift it. So you see, egoism is not bad, but the mistake is we identify the knowledge the Self has - that it can lift the table - with the body. This is the mistake, that the knowledge the self has about itself is identified with the body. So egoism is really a clue to the power that self possesses. Now look here, I am against the annihilation of the Self, because if it is destroyed then, we cannot work at all. Now all saints, at least in India, have said that annihilation of the Self is necessary but I am against it.
అహంకారం అంటే ఏమిటి?
అహంకారం చెడ్డదేమీ కాదు. నిజానికి అది ఒక సూచిక. దేన్నో సూచిస్తోంది. ఇక్కడొక బల్ల ఉంది; 'దీన్ని నేను ఎత్తగలను' అని నాలో అనిపించేది అహం; అహం అనే శక్తి 'నేను ఎత్తగలను' అని అనిపించడం వల్లే బల్లనెత్తగలుగుతున్నాను.  కాబట్టి అహం చెడ్డదేమీ కాదు. మనం చేసే పొరపాటు ఏమిటంటే ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆటమదని గాకుండా శరీరానిదనుకుంటాం. కాబట్టి అహంకారం అనేది వాస్తవానికి ఆత్మకుండే శక్తిని సూచించేది. 
ఇక్కడ నేను ఆత్మ యొక్క నిర్మూలనాన్ని సమర్థించను; వ్యతిరేకిని. ఎందుకంటే ఆత్మ లేకపోయినట్లయితే అసలు మనం ఏ పనీ చెయ్యలేము. మొత్తం మహాత్ములమదరూ, కనీసం భారత దేశంలోని మహాత్ములు, ఆత్మ నిర్మూలనం చాలా అవసరం అన్నారు; కానీ నేను దానికి వ్యతిరేకిని. 
*
Please throw some more light on egoism.
Egoism, I will tell you what it is. Man takes God's work and throws his own work on God. This is the real difficulty. We should play our part and allow God to do His work in His own way.
అహంకారం మీద మరికొంత జ్ఞానాన్ని అందిస్తారా?
అహంకారం అంటే ఏమిటో చెప్తాను మీకు. మనిషి భగవంతుడు చేసే పని  తీసుకుంటాడు; గాని తను చేయవలసిన  పనిని కూడా భగవంతునిపైనే పడేస్తాడు. ఇదీ అసలు సమస్య. మన వంతు పని మనం చేస్తూ, భగవంతుడిని తన పనిని ఆయనని చేయనివాలి;  ఆయనకిష్టమైన విధంగా చేయనివ్వాలి. 
*
We are evil people and what are evil ways?
Doing unnatural things, that is evil. The things which make man spiritually and physically strong are good, while those which make man mentally and physically weak are bad.
మేము దుష్టులయం; దుష్ట విధానాలంటే ఏమిటి?
అసహజమైన పనులు చెయ్యడం, ప్రకృతి విరుద్ధమైన పనులు చెయ్యడం, అవి దుష్టకార్యాలంటే.   మనిషిని శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలపరచేవి మంచివి; మానసికంగా, శారీరకంగా బలహీనపరచేవి చెడ్డవి. 
*
How exactly would you define selfishness?
If your heart does not acknowledge the service that one does to you, then that is selfishness.
స్వార్థాన్ని మీరేవిధంగా నిర్వచిస్తారు?
మీకు ఇతరులు చేసిన సేవను మీ హృదయం గుర్తించకపోతే అదే స్వార్థం అంటే. 
*
Master, what about the nature of fear?
Fear is the hallucination of wisdom. If wisdom is right, there can be no fear. 
మాస్టర్, భయం సంగతేమిటి?
భయం అంటే విజ్ఞత యొక్క భ్రాంతి. విజ్ఞత సరైనదయితే, భయం ఉండటానికి వీల్లేదు. 
*

1 కామెంట్‌:

  1. కృష్ణారావు గారు.. ఇది సమీక్షా సమయం అంటారు, కొత్త సంవత్సరం నన్ను నేను సమీక్షిన్చుకోవలసి ఉంది. మీరు ఈ స్పష్తీకరణల రూపం లో అందిస్తున్న గుళికల రూపంలోని జ్ఞాన మౌక్తికాలు ఎంతో సహకరిస్తున్నాయి ... నా పొరపాట్లు గుర్తిన్చుకోడానికి, ఎక్కడెక్కడ సవరణలు చేసుకోవాలి తెలుస్తున్నాయి. ధన్యవాదాలు.... మీ ఈ యజ్న ప్రయత్నాన్ని కొనసాగించగలరు.

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...