బాబూజీ స్పష్టీకరణలు - 9
Are you a Guru?
I do not think like that. I think myself to be only one of the associates of my own association.
మీరు గురువా?
నేను అలా అనుకోను. నా స్వంత సమూహంలో ఉన్న సహచరుల్లో నేను కూడా ఒకడినని అనుకుంటాను.
*
But I think that many people regard you as the Guru or the Master?
Well, they will have to use some word when referring to me. They prefer this word, which I do not like.
కానీ మిమ్మల్ని చాలా మంది గురువు అని, మాస్టర్ అని సంబోధిస్తున్నారు కదా?
సంబోధించడానికి ఏదోక పదం వాడాలి కదా? వాళ్ళు ఈ పదాన్ని ఎంచుకున్నారు. ఆ పదం నాకిష్టం లేదు.
*
Some say the Guru is inside...
I will tell you. God is the only Guru. All the others are working under His guidance and directions. Really speaking if a man says he is a Guru, he is not fit to train others in spirituality. Such a person is really usurping the position of God.
కొంతమంది గురువు లోపలున్నారంటారు...
నేను చెప్తున్నాను, కేవలం భగవంతుడు మాత్రమే గురువు. మిగిలినవారందరూ ఆయన మార్గదర్శనంలో, వారి ఆదేశాల మేరకు పని చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఒక వ్యక్తి తనను తాను గురువు అని అనుకుంటే, అతను ఆధ్యాత్మిక శిక్షణనివ్వడానికి అర్హుడు కాడు. అటువంటి వ్యక్తి నిజానికి భగవంతుని స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లవుతుంది.
*
How did you begin this work that you are doing now?
My Master ordered me to do it, and so I started it.
మీరిప్పుడు చేస్తున్న పని ఎలా ప్రారంభించారు?
నా మాస్టర్ ఆజ్ఞాపించారు కాబట్టి నేను ప్రారంభించాను.
*
How did you meet your Master?
It was accidental. I had the idea that I must get a good Master and I prayed for it and I got my Master.
మీరు మీ మాస్టరును ఏ విధంగా కలిశారు?
ఆకస్మికంగా కలవడం జరిగింది. నాకొక మంచి మాస్టర్ లభించాలనుకునేవాడిని; అందుకోసం ప్రార్థించాను; నాకు దొరికారు కూడా.
*
Was Lalaji born before this life?
No. That is impossible.
ఈ జన్మకు ముందు లాలాజె జన్మించడం జరిగిందా?
లేదు. అసాధ్యం.
*
Do you feel any contact with your Master?
There is contact always.
మీ మాస్టరుతో సంపర్కం అనుభూతి చెందుతూ ఉంటారా?
ఎల్లవేళలా ఆ సంపర్కం ఉంటుంది.
*
How?
In the way in which it should be.
ఎలా?
ఉండవలసిన విధంగా.
*
You are a spiritual Master, but you smoke?
Yes, I smoke. Why do you worry? I may take poison myself, but if I can give you nectar you should take it.
మీరు ఆధ్యాత్మిక గురువై ఉండీ పొగత్రాగుతున్నారు?
అవును. నేను పొగ త్రాగుతాను. కానీ నీకెందుకు బాధ? నాకు నేను విషం తీసుకోవచ్చు, కానీ నీకు అమృతం ఇస్తున్నప్పుడు నువ్వు గ్రహించాలి.
*
ahaa !
రిప్లయితొలగించండి