14, జనవరి 2024, ఆదివారం

బాబూజీ స్పష్టీకరణలు - 6

 


బాబూజీ స్పష్టీకరణలు - 6 

Will I see the light when I meditate?
I have written somewhere that in the original condition there is neither light nor darkness. It is like the colour of the dawn. The Nasadiya Sukta also says the same thing. 
నేను ధ్యానం చేస్తున్నప్పుడు వెలుగు కనిపిస్తుందా? 
ఆ మూల స్థితిలో వెలుగు కానీ చీకటి కానీ ఉండదని నేనెక్కడో వ్రాయడం జరిగింది. దీని రంగు ఉషస్సు రంగులా ఉంటుంది. నాసదీయ సూక్తం కూడా ఇదే చెప్తుంది. 
*

*
Meditation is passive. You do nothing. How can it give results?
We meditate on the heart supposing Divine light to be there. It means you are playing on your own heart, which is itself a sport and a work. You know you are meditating; that means doing something; and the place on which you you work, the heart, is also there. And you have to reach your goal; this idea is also there, and you wait for something sub-consciously. That means you are not inert but so busy that you are doing three things at the same time. So passivity is lost in activity.
ధ్యానం అనేది పరోక్షంగా చేసేది; అక్కడ ఏమీ చేయడం ఉండదు. మరి ఫలితాలు ఎలా వస్తాయి? 
మనం హృదయంలో దివ్యమైన వెలుగు ఉందని ధ్యానిస్తాం. అంటే మన హృదయం మీద మనమే ఆడుకుంటున్నాం; అంటే అది ఒక ఆట, పనీ కూడా. మీరు ధ్యానం చేస్తున్నారని మీకు తెలుసు; అంటే యేదో చేస్తున్నట్లే గదా; ఇక పని చేస్తున్న ప్రదేశం అంటే హృదయం కూడా ఉంది; పైగా మీరు గమ్యాన్ని చేరుకోవాలన్న ఆలోచన కూడా ఉంది; ఆ విధంగా మీరు తెలియకుండానే ఉపచేతన స్థితిలో దేని కోసమో నిరీక్షిస్తున్నారు కూడా. అంటే మీరు ఏమీ చేయకుండా లేరు; మూడు పనులు ఏకకాలంలో చేస్తున్నారు. ఆ విధంగా పరోక్షంగా చేయడం అనేది క్రియాశీలతలో లీనమైపోయింది. 
*
What are the visions and experiences one feels in meditation?
Visions are unnecessary and have really speaking, no value as indicators of spiritual progress. A vision is nothing but a locked up impression being allowed to surface by the cleaning process. Therefore all that come out as visions are nothing but earlier impressions formed in us by our thoughts and actions. Visions have no value in spiritual life. 
ధ్యానంలో సాధకుడు అనుభూతి చెందే దర్శనాలు, అనుభవాల ప్రాముఖ్యత ఏమిటి?
ధ్యానంలో కలిగే దర్శనాలు నిజానికి అనవసరం; నిజం చెప్పాలంటే ఇవేవీ కూడా ఆధ్యాత్మిక పురోగతికి సంకేతాలు కావు. దర్శనం అంటే నిజానికి శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా మరుగున దాగిన ముద్రలు ఉపరితలంపైకి రావడం వల్ల అనుభవంలోకి రావడం అంతే. కాబట్టి మనకు కలిగే దర్శన అనుభవాలన్నీ కూడా మన ఇంతకు పూర్వం చేసిన ఆలోచన వల్ల, చేతల వల్ల ఏర్పడిన ముద్రలు తప్ప మరొకటి కాదు. ఆధ్యాత్మిక జీవనంలో వీటికి ఏ ప్రాముఖ్యతా లేదు. 
*
As an abhyasi continues to meditate year after year will the process become easier or will thoughts continue to come?
The intensity of thoughts will be reduced, but not in a day. Meditate longer and bring it up to one hour. Then see the results.
అభ్యాసి సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తున్న కొద్దీ ఈ ప్రక్రియ తేలికవుతుందా లేక ఆలోచనలు వస్తూనే ఉంటాయా?
ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. కానీ ఒక్క రోజులో జరిగిపోదు. నెమ్మదిగా ధ్యానాన్ని ఒక్క గంటకు పొడిగించండి. అప్పుడు చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో. 
*
It is very difficult. 
Only because you are not doing it. I can easily do it. I am not a special person, and if I can do it you can also do it.
ఇది చాలా కష్టం. 
చేయకపోతేనే కష్టం. నేను తేలికగా చేయగలుగుతున్నానుగా. నేనేమీ ప్రత్యేక వ్యక్తిని కాదే; మరి నేను చేయగలిగినప్పుడు, తప్పకుండా మీరు కూడా చేయగలుగుతారు. 
*
Is suffering necessary for spiritual growth?
No. They are also left behind. But I am telling you one thing. There have been saints in India who have presented themselves before God with petition that all the miseries of the world may be given to them. You now compare yourselves with them. 
ఆధ్యాత్మిక ఎదుగూడాలకి కష్టాలు పడటం అవసరమా?
అవసరం లేదు. అవి కూడా పోతాయి. కానీ నేనొక విషయం చెప్పడాలచుకున్నాను; భారత దేశంలో పూర్వం మహాత్ములమదరూ భగవంతుడిని ప్రపంచంలో కష్టాలన్నీ వాళ్ళకు ప్రసాదించమని కోరుకునేవారు; మీరు వాళ్ళతో పోల్చుకొని చూడండిప్పుడు. 
*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...