బాబూజీ స్పష్టీకరణలు - 5
Master, you wrote 'Reality at Dawn' many years ago. This is also the case with your other books such as 'Efficacy of Raja Yoga' and 'Commentary on Ten Commandments'. Will you be reviewing these some time? Perhaps some of the points raised by you in those books are not valid anymore?
I am telling you, these books were not written for today or for one year, or even for hundred years. What is written there is for all time. They are for the future. That is why even though they are simple, many people find it very difficult to understand them.
మాస్టర్, చాలా యేళ్ళ క్రితం మీరు 'రియాలిటీ ఆట డాన్' అనే పుస్తకం వ్రాశారు. అలాగే 'ఎఫికసీ ఆఫ్ రాజయోగా', 'కామెంటరీ ఆయన టెన్ కమాండ్ మెంట్స్' అనే గ్రంథాలు కూడా వ్రాశారు. వీటిని కొంత కాలం తరువాత సమీక్షించడం ఉంటుందా? బహుశా ఈ పుస్తకాలలో మీరు వ్రాసిన కొన్ని అంశాలు ఇక వర్తించకపోవచ్చునేమో కదా?
నేను మీకు చెప్తున్నాను, నేను వ్రాసిన ఈ పుస్తకాలు కేవలం ఈరోజు కోసమో, లేక పది సంవత్సరాల కోసమో, లేక రాబోయే 100 సంవత్సరాల కోసమో వ్రాసినవి కావు. ఇందులో వ్రాసినవి అన్ని కాలాలకూ వర్తించేవి. అవి భవిష్యత్తు కోసం వ్రాసినవి. అందుకే అవి సరళంగా ఉన్నప్పటికీ చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు.
*
How can that be Master? If they are simple, should they not be easy to understand?
I will give you the example of Vedas. It is my idea that when they were written by the Rishis in ancient times, few people could understand them. Today it is so easy to know their meaning. Similarly with Sahaj Marg teachings, they are for the future. The persons of the future will understand them easily.
అదెలా సాధ్యం మాస్టర్? మరి సరళంగా ఉన్నప్పుడు తేలికగా అర్థమవ్వాలి కదా?
నేను మీకు వేదాల ఉదాహరణ యిస్తాను. ప్రాచీన కాలంలో ఋషులు వాటిని వ్రాసినప్పుడు చాలా కొద్ది మండే అర్థం చేసుకోగలిగారని నా అభిప్రాయం. ఈ రోజున వేదాలను చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతున్నాం. సహజమార్గ బోధలు కూడా అంతే; భవిష్యత్తు కోసం రచించినవి. భావిష్యత్తులోని వ్యక్తులు వీటిని తేలికగా అర్థం చేసుకోగలుగుతారు.
*
అబ్బ ! ఇంత విశిష్టమైన పధ్ధతి ! ఎంతో చక్కని పధ్ధతి !!
రిప్లయితొలగించండి