బాబూజీ స్పష్టీకరణలు - 2
Is God inside us?
God is inside everything, but the real question is, are you inside God?
భగవంతుడు మన లోపల ఉన్నాడా?
భగవంతుడు అన్నిటిల్లోనూ ఉన్నాడు. కానీ అసలు ప్రశ్న నువ్వు భగవంతునిలో ఉన్నావా? అన్నది.
*
How can be God defined Babuji?
If all the adjectives are withdrawn, whatever left, is God.
భగవంతుడిని ఎలా నిర్వచించగలం?
విశేషణాలన్నీ తీసేస్తే మిగిలేది భగవంతుడు.
*
To realise God, or the Divine Nature, is that to be God?
No nobody can be God. There is only God and nobody other than Him can be God. But we can be God-like.
భగవంతుని సాక్షాత్కారం అన్నా, మనలో ఉన్న దివ్య ప్రకృతిని సాక్షాత్కరించుకోవడం అంటే భగవంతునిగా మారిపోవడమేనా?
ఎవ్వరూ భగవంతుడు కాలేరు. భగవంతుడు మాత్రమే భగవంతుడు, మరెవ్వరూ భగవంతుడు కాలేరు. కానీ మనం భగవంతునిలా మారవచ్చు.
*
What is meant by Realisation?
You know what you are, but you do not know what He is. When you know, or feel in yourself, what He is, that is Realisation.
అసలు సాక్షాత్కారం అంటే ఏమిటి?
నువ్వేమిటో నీకు తెలుసు, కానీ ఆయన (భగవంతుడు) ఏమిటో నీకు తెలియదు. ఆయన ఏమిటో నీకు తెలిసినప్పుడు, లేక నీలో ఆయన అనుభూతి కలిగినప్పుడు, అదీ సాక్షాత్కారం అంటే.
*
What is Reality?
Reality is baseless base.
సత్యతత్త్వం అంటే ఏమిటి?
సత్యతత్త్వం అంటే ఆధారం లేని ఆధారం.
*
What is perfection?
When all the powers are so developed that moderation reigns through out.
పరిపూర్ణత అంటే ఏమిటి?
మనలో సర్వత్రా అంతటా మితం ప్రబలంగా ఉండే విధంగా మనలో శక్తులన్నీ పెంపొందినప్పుడు దాన్ని పరిపూర్ణత అనవచ్చు.
*
Master, can you explain to me what this 'self' is? What do sages mean when they say 'Self'? Is it God?
It is not God; it is other than God, the idea of the individual in the self. It is the result of egoism.
మాస్టర్, ఈ 'నేను' (ఆత్మ) అనేదేమిటో వివరించగలరా? మహర్షులు 'పరమాత్మ' అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? అది భాగ్యవంతుడేనా?
అది భగవంతుడు కాదు; దైవం కానిది. ఆత్మలో ఉండే వ్యక్తిగత తత్త్వం. నేను అనేది అహంకారం యొక్క ఫలితమే.
*
What is mature thinking?
Having one Goal, one Master and one Method.
పరిపక్వ ఆలోచన అంటే ఏమిటి?
ఒకే గమ్యం, ఒకే మాస్టర్, ఒకే పద్ధతి కలిగి ఉండటం.
*
What is religion?
Certain dogmas collected at one place is religion.
మతం అంటే ఏమిటి?
కొన్ని నమ్మకాలు ఒక్క చోట సేకరించినడే మతం.
*
ఆహా ! ఆహా !
రిప్లయితొలగించండి