బాబూజీ స్పష్టీకరణలు - 7
Does Constant Remembrance develop naturally or does one have to work upon it?
If there is great deal of love it can develop naturally.
నిరంతర స్మరణ సహజంగా పెంపొందుతుందా లేక సాధకుడు కృషి చెయ్యాలా ?
ప్రేమ అత్యధికంగా ఉంటే సహజంగానే పెంపొందుతుంది.
*
How to increase the Constant Remembrance? Is there any way?
We must think one thought, and only one thought repeatedly. The idea must be there in the heart. It should not be repeated as a sort of mantra.
నిరంతర స్మరణ పెరిగే మార్గం ఏదైనా ఉందా?
ఒక్క ఆలోచనే ఉండాలి; ఒకే ఒక్క ఆలోచన. అది హృదయంలో ఉండాలి. మంత్రమలా పదే పదే ఉచ్ఛరించకూడదు.
*
How to have faith, or develop it in one self?
Really speaking, faith is not necessary. What we have to do is to trust in some one and begin. And then if you find you are progressing, Faith will automatically develop. Now I will tell you, people speak so much of conscience. Conscience should guide us but we guide our conscience we choose. Now what is Conscience? It is really of our levels, the Manas, Buddhi, Chit and the Ego. Where these are balanced and merge into the one original thought, then that is the real conscience.
విశ్వాసం పెంచుకోవడం ఎలా, వ్యక్తి తనలో పెంపొందించుకోవాలంటే ఎలా?
నిజం చెప్పాలంటే విశ్వాసం అవసరం లేదు. మనం చేయవలసిందల్లా, ఎవరొకరిని నమ్మి ప్రారంభించాలంతే. అప్పుడు మీరు ముందుకు సాగుతూ ఉంటే విశ్వాసం తనంతతానుగా ఏర్పడుతుంది. నేనిక్కడ ఒకటి చెప్తాను; జనం మనస్సాక్షి గురించి చాలా మాట్లాడుతూంటారు. మనస్సాక్షి మనకు దారి చూపించాలి కానీ మనం మనస్సాక్షికి మార్గదర్శనం చేస్తూంటామ. అసలు మనస్సాక్షి అంటే ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తం అహంకారం - ఇవన్నీ కలిపిస్తే మనస్సాక్షి. ఇవన్నీ సమత్వ స్థితిలో ఉండి లయమైపోయి ఒక్క మూల ఆలోచనగా మారినప్పుడు అది నిజమైన మనస్సాక్షి అవుతుంది.
*
Speaking of faith, is it a gift or is it an act of will?
Both things are right.
విశ్వాసం అన్నప్పుడు అది దివ్య కానుకా లేక సంకల్పంతో చేయవలసినడా?
రెండూ సరైన సమాధానాలే.
*
When you speak about reaching the goal, you say that faith and iron will are necessary. You also say that for reaching the goal Surrender is necessary. Now iron will and surrender, of these two which comes first? Does one come after the other, or do they come together?
Surrender is the thing, but will, must come first. I think they are the same thing really speaking, but they appear in different colours.
గమ్యాన్ని చేరుకునే అంశానికి వచ్చినప్పుడు, విశ్వాసం, ఉక్కు సంకల్పం అవసరమని చెప్పారు మీరు. అలాగే శరణాగతి అని కూడా అవసరం అన్నారు. ఉక్కు సంకల్పం, శరణాగతి ఈ రెంటిలో ఏది ముందు రావాలి? ఈ రెండు ఒకదాని తరువాత ఒకటవస్తాయా, లేక రెండూ ఒకేసారి వస్తాయా?
శరణాగతి రావాలి, కానీ సంకల్పం ముండవస్తుంది. నిజానికి ఇవి రెండూ ఒక్కటేననిపిస్తుంది. కానీ అవి రెండూ వివిధ రంగుల్లో కనిపిస్తాయి.
*
What about love? Is it necessary?
Well, I am telling you love is very necessary. Love for the Master or Love for God must be there. But a stage comes in spiritual development when love too must fade out.
ప్రేమ సంగతేమిటి? ప్రేమ అవసరమా?
ప్రేమ చాలా అవసరమని నేను చెప్తున్నాను. మాస్టర్ పట్ల ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి. కానీ ఆధ్యాత్మిక పురోగతిలో ఒక దశలో ఈ ప్రేమ కూడా అదృశ్యమైపోయే దశ వస్తుంది.
*
What is Surrender?
Absence of 'I' is surrender. First thing, is devotion to God, Second, always feel dependence. Suppose you have surrendered to God, if the surrender is real, there will be surrender to the whole of humanity.
శరణాగతి అంటే ఏమిటి?
'నేను' అనేది లేకపోవడం. ముందు భగవంతుని పట్ల భక్తి. రెండవది, భగవంతునిపై ఎల్లవేళలా ఆధారపడి ఉండటం. భగవంతుని పట్ల సమర్పణ భావం వచ్చినట్లయితే, ఆ సమర్పణ సత్యమైతే, సమస్త మానవాళి పట్ల సమర్పణ భావం కలుగుతుంది.
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి