పూజ్య బాబూజీ మహారాజ్
125 వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా
దాజీ
ఇచ్చిన సందేశ సారాంశం
30 ఏప్రిల్
2024, కాన్హా శాంతి వనం.
భగవత్సాక్షాత్కారం అభావ స్థితి లేకుండా సాధ్యమా?
అభావ స్థితి శరణాగతి లేకుండా ప్రారంభమవుతుందా?
శరణాగతి అంగీకారం లేకుండా సాధ్యపడుతుందా?
అంగీకారం ప్రేమ లేకుండా సాధ్యమా?
ఇద్దరి జీవుల మధ్య పరస్పర స్పందన లేకుండా ప్రేమ సాధ్యమా?
పరస్పర ఆరాధన లేకుండా పరస్పర స్పందన సాధ్యమా?
అనుభవం లేకుండా ఆరాధన సాధ్యమా?
అనుభవం అభ్యాసం లేకుండా సాధ్యమా?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పక “కాదు” అనే చెప్తామనుకోండి.
అంతా అభ్యాసం....అభ్యాసం.... అభ్యాసం.... ఆరంభం ...అంతం అంతా అదే .
రిప్లయితొలగించండి