కామపూరితమైన ఆలోచనలు, భావాలు
ఆధ్యాత్మిక సాధనలో, అంతరంగ వికాసంలో, అవరోధాలుగా నిలిచే, నిత్యం ఎదుర్కొనే మరో అంశం - కామపూరితమైన ఆలోచనలు. కామం అంటే తీవ్రమైన వాంఛ. దీనికి సంబంధించిన ఆలోచనలు విపరీతంగా ఉన్నప్పుడు మనసంతా ఆవరించి, ప్రాధాన్యతలపై దృష్టి నిలవనీయకుండా పోవడం వల్ల, మన వివేకాన్ని కోల్పోతూ ఉంటాం. కామం జీవితంలో భాగమే తప్ప, జీవితమే కామం కాకూడదు. కామానికి నిర్దుష్టమైన దివ్య ప్రయోజనం ఉంది. కానీ మోతాడుకు మించి ఉన్నప్పుడు అది అనర్థాలకు దారి తీసి ఆత్మవికాసాన్ని కుంటుపరుస్తుంది. కామం, క్రోధం దైవదత్తమైనవని, వాటిని నాశనం చేయలేమని అంటారు బాబూజీ. కామం అంటే కోరిక; కామం ఉన్నది భగవంతుని కోరుకోటానికని, దానికి అవరోధంగా నిలిచేవాటిపై చూపించడం కోసమే క్రోధం భగవంతుడు ప్రసాదించాడని పూజ్య చారీజీ చెప్పడం జరిగింది. కాబట్టి కామాన్ని భగవంతుని కోరుకోవడానికి, దానికి అడ్డు వచ్చినవాటిని తొలగించడం కోసం మాత్రమే కోపాన్ని వినియోగించుకోవాలి అంటారు పెద్దలు. ఇతర రకంగా ఉండే కోపాన్ని తొలగించుకోవలసినదే.
అంతే కాదు, కామం అంటే కేవలం లైంగిక పరమైనదే కానక్కరలేదంటారు చారీజీ. ఆంగ్లంలో లస్ట్ (lust) అంటారు. ఈ తీవ్ర వాంఛ, డబ్బుమీద గాని, అధికారంపై గాని, ఇత్యాదివాటిపై అత్యధికంగా ఉండటం కూడా కామమే అంటారు. మోతాదు మించినప్పుడు, వివేకాన్ని నశింపజేస్తుంది కామం.
హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం
మన ఆధ్యాత్మికోన్నతికి అడ్డుపడే ఈ కామపూరితమైన ఆలోచనల్లో ఒకవిధమైన బ్యాలన్స్ తీసుకురావడానికి హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ పద్ధతి, పాయింట్ 'బి' యొక్క శుద్ధీకరణ ప్రక్రియను నిర్దేశిస్తుంది. ఈ యౌగిక ప్రక్రియను ప్రతి రోజూ ఉదయం చేసే ధ్యానానికి ముందు 7 నముషాలకు మించకుండా చేయవలసి ఉంది. వీటి ప్రాబల్యం తగ్గడం కొద్ది కాలంలోనే అనుభూతి చెందగలుగుతారు.
ప్రతి అవలక్షనానికి ఒక పరిష్కారం ఉంది హార్ట్ ఫుల్ నెస్ పద్ధతిలో.
రిప్లయితొలగించండిఅసలు వీటిని తొలగిన్చుకోవదమేలా అనే సమస్య మానవాళి ముందు ఉండేది... ఇప్పుడు సరళం, సహజం అయిన పధ్ధతి అందించడం ద్వారా వీటినుండి బయట పడి మనసు అంతటినీ భగవంతుని వైపు మరల్చగలం.