సాంసారిక చింతలు
మనిషికి, సంసారంలో ఉన్నంత సేపూ సాంసారిక చింతలు తప్పవు. కానీ వాటిని యే విధంగా వ్యవహరిస్తామన్నదాని బట్టి, ఎలా స్పందిస్తామన్నదాని బట్టి, వాటి ప్రభావాన్ని మనపై చాలా వరకూ తగ్గించుకోవచ్చు. సాంసారిక చింతలు మన ఆధ్యాత్మిక ప్రగతిని కుంటుపరచవచ్చు. అసలు సాధన చేయడానికే సమయాన్ని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
ప్రాపంచిక/సాంసారిక చింతలూ అంటే అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, అవమానాలు, మానవ సంబంధాల్లో ఇబ్బందులు, రకరకాల ఒత్తిళ్ళు; వీటినే ఈతి బాధలని కూడా అంటాం.
హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం
హార్ట్ఫుల్నెస్ సాధన ప్రకారం, ఈ చింతలకు సంబంధించిన ముద్రలు మనం ప్రతి నిత్యం పాయింట్ 'ఎ' పై తెలియకుండానే ఏర్పరచుకుంటూ ఉండటం జరుగుతుంది. దీనిపై ప్రతీ రాత్రి, పడుకునే ముందు ధ్యానించవలసి ఉంది. దీని వల్ల వాటి తీవ్రత తగ్గి, హృదయభారం తగ్గడం అనుభూతి చెందడం జరుగుతుంది. కొన్నాళ్ళకు అసలు ముద్రలు ఏర్పడకుండే ఉండే జీవన విధానం కూడా అలవడుతుంది.
అవును కదా !
రిప్లయితొలగించండి