భయం
భయం లేని జీవి ఉండదు. భయం మనలను కృంగదీస్తుంది. బలహీనపరుస్తుంది. సృజనాత్మక శక్తిని హరిస్తుంది. నకారాత్మకతను పెంచుతుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనారోగ్యానికి దారి తీస్తుంది. భయం మనలను వణికిస్తుంది. గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. భ్రమలకు దారి తీస్తుంది. స్పష్టత కోల్పోయేలా చేస్తుంది. గందరగోళంలో పడేస్తుంది.
భయం వల్ల ప్రయోజనాలు
భయం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భయం క్రమశిక్షణలో ఉంచుతుంది. మనిషిని అదుపులో ఉంచుతుంది. భయం వల్ల గౌరవం కూడా ఏర్పడుతుంది. అలాగే గౌరవం వల్ల ఆరోగ్యకరమైన భయం కూడా ఉంటుంది.
భయంలో రకాలు
నిత్యజీవితంలో అనేక రకాల భయాలను ఎదుర్కొంటూ ఉంటాం - చీకటి అంటే భయం, ఎత్తులంటే భయం, పాముల్లాంటి పాకే జీవులంటే భయం, తిరస్కరణ భయం, తెలియని భయం, ఇలా రకరకాల భయాలున్నాయి మనలో.
అన్ని భయాలకూ మూలం
అన్ని భయాలకూ మూలం మృత్యుభయం. ఈ భయం పోయిందంటే అన్ని భయాలూ పోతాయి.
అసలు ఈ భయం ఎప్పుడు మొదలయ్యింది మనిషిలో?
సహజమార్గ గురువుల ప్రకారం మనిషి, అన్నిటికీ మూలం అయిన ఆ భగవంతుడి నుండి మొట్టమొదటసారి విడిపోయినప్పుడు, విడిపోవడం వల్ల కలిగిన మొట్టమొదటి సంస్కారం - భయం.
భయానికి హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం
ఆ భయం వల్లనే మనలో ఇతర అన్నీ సంస్కారాలూ ఏర్పడి మనిషి జటిలంగానూ, అశుద్ధంగానూ తయారయ్యాడు. హార్ట్ఫుల్నెస్ సాధన ద్వారా ఈ సంస్కారాన్ని మొట్టమొదటగా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అందుకే తక్కిన అన్నీ సంస్కారాలూ తేలికగా రాలిపోయే అవకాశం ఉంది. తద్వారా కర్మరాహిత్యం సాధించే అవకాశం ఉంది ఈ జన్మలోనే.
భయం ఎలా పోగొట్టుకోవాలి?
భయం ఎలా పోగొట్టుకోవాలి అని పూజ్య చారీజీ మహారాజ్ గారికి నేనొకసారి ఉత్తరం వ్రాసినప్పుడు, ఆయన ఈ క్రింది విధంగా వ్రాయడం జరిగింది:
"భయాన్ని నిరంతర స్మరణ వల్ల తొలగించుకోవచ్చు. దయచేసి ప్రయత్నించు." అని వ్రాశారు.
ఎంత చక్కటి విశ్లేషణ. మీఋ స్వయంగా చారీజీ గారి నుంచి పొందిన సమాధానం ఎంతో విలువైనది. దానిని మా అందరితో పంచుకుని మాకూ ధైర్యం కలిగంచారు. ధన్యవాదాలు .
రిప్లయితొలగించండినిజంగా ప్రయత్నించాలి
రిప్లయితొలగించండి