బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 5
రాత్రి ప్రార్థనా-ధ్యానం
సహజ మార్గ ఆధ్యాత్మిక పథంలోని మూడవ యౌగిక ప్రక్రియ, రాత్రి పడుకోబోయే ముందు చేసుకునే ప్రార్థనా-ధ్యానం. ఇది 10 నుండి 15 నిముషాలు చేసుకుని నిద్రలోకి జారుకోవలసిన ప్రక్రియ.
అసలు ప్రార్థన అంటే ఏమిటి?
ప్రార్థన అనేది భగవంతునికీ, భక్తునికీ మధ్య ఉండే అనుసంధానం; భాగవత తత్త్వాన్ని, సాధకుడినీ కలిపే సాధనం. అంతర్యామిని అహాన్ని కలిపే మాధ్యమం ప్రార్థన.
సహజ మార్గం ప్రత్యేకంగా సూచించే ప్రార్థన ఏమైనా ఉందా?
బాబూజీ ఉత్కృష్టమైన ధ్యాన సమాధిలో ఊర్ధ్వ లోకాల నుండి అందుకున్న ప్రార్థన ఈ విధంగా ఉంది:
ఓ, మాస్టర్!
మానవ జీవిత యదార్థ లక్ష్యము నీవే.
మేమింకనూ కోరికలకు బానిశాలమై యుండుట
మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది.
మమ్ము ఆ దశకు జేర్చు ఏకైక స్వామివి, శక్తివీ నీవే.
రాత్రి పడుకొనే ముందు, దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తూ, కొన్ని నిముషాలు, ఈ ప్రార్థనను మనసులో రెండు-మూడు మార్లు అనుకుని, దీని భావంపై ధ్యానిస్తూ, ఉదయం లేచినప్పటి నుండి పడుకునే లోపల ఏమైనా పొరపాట్లు జరిగి ఉన్నట్లయితే, వాటికి పశ్చాత్తాపం చెందుతూ, మరలా ఆ పనులు చేయబోమని తీర్మానం చేసుకోవాలి.
పై ప్రార్థన యొక్క భావాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు, జీవితంలోని వివిధ దశలలో, వివిధ సందర్భాలలో, అనేక అర్థాలు స్ఫురించడం జరుగుతుంది. గురువు మనపై చేసే పని పట్ల సహజంగా మనం మరింత సహకారాన్ని అందించగలుగుతాం. మన అంతరంగ శుద్ధి జరుగుతున్న కొద్దీ అర్థాలు కూడా అనేకం స్ఫురించడం జరుగుతాయి. వాటిని అభ్యాసులు తమ ఆధ్యాత్మిక డైరీల్లో వ్రాసుకుంటూ ఉంటారు కూడా.
ఎటువంటి ప్రార్థన భగవంతునికి అందుతుంది?
ప్రార్థన ఒక పని కంటే కూడా ఒక వైఖరి అనవచ్చు. ప్రార్థనలోని మాటల కంటే కూడా, ఆ మాటల భావం ప్రధానం. ప్రార్థనలోని మాటలు కొన్ని ఉదాత్తమైన భావాలను మనలో కలిగిస్తాయి. కాబట్టి ఎటువంటి వైఖరితో ప్రార్థన చేస్తున్నామన్నడానిపై ఆధారపడుంటుంది, భగవంతునికి ప్రార్థన అందాలంటే. ప్రార్థన గుండె లోలోతుల్లో నుండి సహజంగా పెల్లుబుకాలి. నిస్స్వార్థ వైఖరితో, నిస్సహాయ స్థితిలో, వినమ్రంగా, శరణాగతితో ప్రార్థించడం నేర్చుకోవాలి. అందుకే దీన్ని అభ్యాసంలో భాగంగా ఒక యౌగిక ప్రక్రియగా చెప్పినట్లనిపిస్తుంది.
ప్రార్థన చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
సరైన భావంతో గనుక ప్రార్థించినట్టలేయితే, స్వార్థం తగ్గుతుంది; వినమ్రత పెరుగుతుంది; ప్రేమ, భక్తి పెరుగుతాయి; సమర్పణ భావం పెంపొందుతుంది; భాగ్యవంతునిపై ఆధారపడటం పెరుగుతుంది; సమత్వం చోటు చేసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన అపరాధాభావం నుండి విముక్తులను చేస్తుంది. చేసిన పవరపాట్లకు కన్నీటితో పశ్చాత్తాపం చెందితే శ్రేష్ఠం. కన్నీరు రాకపోతే కృత్రిమంగానైనా కన్నీరు పెట్టుకోమంటారు బాబూజీ. ఒకరోజు నిజంగానే కన్నీరు రావడం మొదలవుతుండంటారు ఆయన.
మనం ప్రార్తనాపూర్వాకం అయిన స్థితిలో ఉండడం మొదలు పెడతాం.
రిప్లయితొలగించండి