బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 10
పరమపదానికి సహజ మార్గ సోపానం
బాబూజీ అని ఆప్యాయంగా పిలుచుకునే సమర్థ గురు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (షాజహానుపూర్, ఉ. ప్ర. భారత్ ), ఆధునిక మానవుడి యొక్క ఆత్మోన్నతికి, జీవిత గమ్యమైన పరమపదాన్ని తేలికగా అధిరోహించడానికి ఒక సరళమైన సోపానాన్ని ఎంతో కరుణతో అనుగ్రహించడం జరిగింది. దాన్నే సహజ మార్గ ఆధ్యాత్మిక పథం అంటారు.
సహజ మార్గ సోపానం
స్వాధ్యాయం
ఉదయం ప్రాణాహుతితో కూడిన ధ్యానం
సాయంకాల శుద్ధీకరణ
రాత్రి ప్రార్థనా-ధ్యానం
ఆధ్యాత్మిక/సహజ మార్గ సాహిత్య పఠనం
స్వచ్ఛంద సేవ
ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొనడం
దశనియమాలను అనుసరిస్తూ భౌతిక జీవనం
ప్రశిక్షకులతో వ్యక్తిగత సిట్టింగులు
వారానికి రెండు సామూహిక ధ్యానాలు (సత్సంగాలు)
స్వాధ్యాయ ఫలితంగా సహజంగా కలిగే పరిణామాలు
నిరంతర స్మరణ
శరణాగతి
దివ్యప్రేమ
పరమాత్మతో సంపూర్ణ లయ స్థితి లేక
మానవ పరిపూర్ణత్వం సిద్ధించడం.
చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండి