13, ఆగస్టు 2025, బుధవారం

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1

 


హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1 
*
సహజ్ మార్గ్ పరిభాషలో సంస్కారాలంటే ఏమిటి? 
మామూలుగా సంస్కారం లేదా? అని వాడుకలో సరైన అలవాట్లను కనబరచకపోతే, అవతలివాళ్ళను అంటూంటాం. ఇక్కడ సహజ్  మార్గ్ సందర్భంలో సంస్కారాలంటే అవి కాదు. 
సంప్రదాయపరంగా వేటినైతే కర్మలని, వాసనలని, పూర్వజన్మల సంస్కారాలని కూడా వాడుతూ ఉంటామో అవే సంస్కారాలు. 

సంస్కారాలు ఎలా ఏర్పడతాయి? 
'నేను' చేస్తున్నానన్న స్పృహతో చేసిన కర్మలు, ఆలోచనలు ముద్రలుగా మనసులో ఏర్పడతాయి. అవే కర్మలు, ఆలోచనలు, మరలా-మరలా పునరావృతమైనప్పుడు అవి కరుడు కట్టి, ప్రవృత్తులుగా మారతాయి. వీటినే సంస్కారాలంటారు. మనసులో ఈ సంస్కారాలు ఏర్పడటమే గాక, అవి బుద్ధిని శాసిస్తాయి కూడా. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్న నానుడి వచ్చింది. బుద్ధి కర్మను అనుసరిస్తుంది; మనం బుద్ధిని అనుసరిస్తాము; అందుకే మన జీవితం కూడా మనం కర్మను అనుసరించే ఉంటుంది. కాని బుద్ధి హృదయాన్ని అనుసరించాలి. ఆశిక్షణయనే ధ్యాన శిక్షణ అని అంటాం.  ముందు ముద్రలుగా ఏర్పడి, ఆ ముద్రలే సంస్కారాలుగా మారతాయి. 

సంస్కారాలు 4 రకాలు
నిత్యం మనం బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పుడు 4 రకాలుగా ఈ సంస్కారాలను ఏర్పరచుకుంటూ ఉంటాం - 1) ఇష్టాలు-అయిష్టాలు (రాగద్వేషాలు) 2) ఇంద్రియ సుఖాలకు సంబంధించిన ముద్రలు 3) సాంసారిక చింతలు (ఈటీ బాధయాలంటాం) 4) అపరాధభావం (గ్లాని) - చేయవలసినవి చేయకుండా ఉండటం, చేయకూడానివి చేయడం వల్ల కలిగే ముద్రలు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1

  హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1   * సహజ్ మార్గ్ పరిభాషలో సంస్కారాలంటే ఏమిటి?  మామూలుగా సంస్కారం లేదా? అని వాడుకలో సరైన అలవాట్...