సమృద్ధ భారత్
మన త్రివర్ణ పతాకం 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సా సందర్భంగా కనుల విందుగా రెపరెపలాడుతున్నది. గర్వంగా భారతీయులందరూ జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
ఎందరో మహానుభావులు, ఎందరో దేశభక్తులు ఎన్నెన్నో త్యాగాలు చేస్తే లభించిన స్వాతంత్ర్యం. అందరినీ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవలసిన రోజు. అదే సమయంలో ఈ రోజు మన ప్రధాన మంత్రి, ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేస్తూ ప్రతీ ఒక్క భారతీయునికి ఇచ్చిన పిలుపును మనసు నిండా నిలుపుకొని సమృద్ధ భారత్ దిశగా కృషి చేయాలన్న సంకల్పం చేసుకోవలసిన రోజు. ఎవరి తోడ్పాటును వారందించాలన్న సంకల్పం చేసుకోవలసిన రోజు.
ఇందుకు ప్రతీ ఒక్కరూ తమలో దేశభక్తిని పెంపొందించుకునేందుకు, నిత్యస్ఫూర్తితో జీవించేందుకు ప్రతి ఒక్కరూ తప్పక స్వామి వివేకానంద వ్యక్తిత్వంపై, వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయవలసి ఉంది. వారి జీవిత ప్రారంభ దశలో దేవుడెక్కడున్నాడు? దేవుడిని చూశారా? అని కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవారు. అలా ఆధ్యాత్మికపరంగా సర్వమూ విదితమైన తరువాత చివరి సంవత్సరాలలో దేశం గురించి మాత్రమే ప్రసంగించేవారు. అమెరికా వెళ్ళి షికాగోలో కోడి అయి కూసి భారతీయులను మేలుకొల్పారు. వారి స్ఫూర్తి ఫలితంగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. ఎందరో ప్రేరితులై క్రియాన్వితులయ్యారు. ఫలితంగా ఈ రోజు మనం సుఖ శ్వాసలను పీల్చుకుంటున్నాం. ఆధునిక భారతంలో మరలా ఈ దేశభక్తి సమృద్ధి దిశగా కృషి చేయడానికి కనిపించకుండా పని చేస్తున్న ఎందరో మహాత్ములున్నారు. దేశభక్తి ద్వారానే దైవప్రాప్తి సాధ్యంఅని చాటిన మహానీయులెందరో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి