శ్రీకృష్ణ జన్మాష్టమి - 2025
ఈ సంవత్సరం శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థ ప్రధాన కార్యాలయం అయిన హైదరాబాదులోని కాన్హా శాంతి వనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఆధ్యాత్మిక శోభతో ఎంతో ఘనంగా ఆధ్యాత్మిక భాండారాతో సమానంగా జరుపుకోవడం జరిగింది. కొన్ని వేలమంది అభ్యాసులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా లైవ్ లో వీక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పూజ్య దాజీ ధ్యానం నిర్వహించక పూర్వం, ముఖ్య అతిథిగా విచ్చేసిన, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రస్తుత సర్ సంఘ్ సంచాలక్ గా వ్యవహరిస్తున్న శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు, పూజ్య దాజీ మనవిపై ఒక అద్భుత ప్రసంగం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పూజ్య దాజీ పలికిన పలుకులు ఇలా ఉన్నాయి:
".... హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏకైక లక్ష్యం భూమ్మీద ఉన్న ప్రతీ ఇంట్లోనూ ధ్యానం జరగాలని, ప్రతీ హృదయం ధ్యానించాలన్నదే". "2025 వ సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంస్థ ఒక విస్తృతమైన, పరిపక్వమైన, నిస్స్వార్థ సంస్థ; గత నూరేళ్ళుగా ఎందరో యువకులు వివాహం కూడా చేసుకోకుండా, ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో, దేశ ప్రగతి కోసం సేవలో నిమగ్నమై ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేసిన ఒక పటిష్ఠమైన సంస్థ" అంటూ మోహన్ భాగవత్ గారిని మన సంస్థ అభ్యాసులకు మార్గదర్శనం చేయమని, ఈ రోజు యొక్క ప్రాశస్త్యం గురించి మాట్లాడి ప్రేరణ కలిగించాలని కోరడం జరిగింది.
ఈ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:
శ్రద్ధేయ దాజీ ముందుంచిన వారి భావాలకు సమాధానాలన్నీ, మనం శ్రీకృష్ణ భగవానుడి జీవిత చరిత్ర నుండి, మచ్చలేకుండా వారు జీవించిన విధానం నుండి, వారి వివేకం నుండి, వారి వాణి నుండి మనం పొందవచ్చు. శ్రీకృష్ణుడికి జీవితం అంతా ఆ విధంగా జీవించేటువంటి శక్తి ఎలా అచ్చయింది? ఇనో విషమ పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. యేదైనా పని యశశ్విగా చేయాలంటే ఎలాగో భగవద్గీతలో చెప్పడం జరిగింది: 1) అధిష్ఠానం: అందరిలో ప్రేమ ఉంది; ఆ ప్రేమను నిరంతరం అనుభూతి చెందడం ఆవసరం; ఈ ప్రేమను ఆధారంగా చేసుకొని జీ వించడమే అధిష్ఠానం; ధ్యానం యొక్క లక్ష్యం కూడా ఆదేనని నుకుంటూ ఉంటాను; ఎందుకంటే ధ్యాన స్థితితో ఎప్పుడూ కూడి ఉండే ప్రయత్నంలో ఉంటాం గనుక. యే తత్త్వంతో అయితే సర్వమూ కలిసి ఉన్నాయో, ఆ ఒక్క తత్త్వం యొక స్మరణలో నిరంతరం అనుభూతి చెందడమే కదా ధ్యానం అంటే. ఆ అధిష్ఠానమే భగవంతుడంటె. యోగః కర్మసు కౌశలం. ఆ భగవంతునితో అనుసంధానం కలిగి ఉంటూ కర్మ చేయడం. యేం చేసావన్నది ప్రధానం కాదు; ఏ విధంగా చేశావన్నదే ముఖ్యం. 2) కరణం - అంటే కార్యం చేసే పద్ధతి. సరైన విధంగా పనులు చేస్తే సరైన ఫలితాలు వస్తాయి. పద్ధతి ప్రకారం చేస్తే పనులు సరిగ్గా అవుతాయి. శ్రీకృష్ణ భగవానుడు చేయడం గాక పాండవుల చేత చేయించేవాడు, కీర్తి వాళ్ళకి కట్టబెట్టేవాడు. ఆయన పరమ యోగేశ్వరుడు, అన్నీ ముందే తెలిసినవాడు; అయినా ఉదాహరణగా నిలుస్తూ అందరి చేత కారమను చేయియించేడు; కర్మ యోగం నేర్పించాడు. సమర్థుడైనా కూడా ఒక క్రమశిక్షణలో ఉండవలసి వస్తుంది; ధర్మం అనే క్రమశిక్షణ అందరికీ ఉంది.
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ||
వెరసి మన జీవితం విజయవంతంగా కాదు, అర్థవంతంగా ఉండాలన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి