ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
31, జనవరి 2024, బుధవారం
బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 3
బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 2
బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 1
30, జనవరి 2024, మంగళవారం
బాబూజీ ఛలోక్తులు
బాబూజీ ఛలోక్తులు
బాబూజీ ఛలోక్తులు విసిరినప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వేవారు. బాగా నవ్వీస్తూండేవారు. కానీ, తన ఛలోక్తుల్లో కూడా సందేశం ఇమిడి ఉంటుందనేవారు. కేవలం కాలక్షేపం కోసం చేసే హాస్యం కాదది. బాబూజీ మాటల్లో చెప్పాలంటే,
"నేను అనవసరంగా మాట్లాడను - నేనేదయినా హాస్యంగా మాట్లాడినా, అందులో ఎప్పుడూ యేదోక అర్థం ఉంటుంది."
కానీ, ఈ హాస్యం ద్వారా మాత్రం ఏ సంతోషమూ కలుగదనీ, తాను ఛలోక్తులు విసిరేది కేవలం మనం విసుగు చెందకుండా ఉండటానికేనని కూడా చెప్పారు బాబూజీ. అయినా వారి హాస్య స్వభావం ఎలా ఉండేదంటే, నవ్వి నవ్వి ప్రాణాలు పోతాయేమోనన్నట్లుగా ఉండేది ఒక్కోసారి.
కొన్ని హాస్య సందర్భాలు:
నిర్వచనానికి నిర్వచనం
ఒకరోజు బాబూజీ, నిర్వచనానికి నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. పడే పడే "నిర్వచనానికి నిర్వచనం ఏమిటి" అంటూ ఉన్నారు.
ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆయన కూడా చెప్పలేదు. సాధారణంగా ఆయనే చెప్పేస్తూండేవారు. అప్పుడు మనం ఎంత మూర్ఖులమో అర్థమయ్యేది. అకస్మాత్తుగా ఒక అభ్యాసి, "నిర్వచనానికి నిర్వచనం కాలం వృథా చేయడమే" అన్నాడు. దానికి బాబూజీ ఇతను చెప్పింది నిజం అన్నారు.
భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు?
అభ్యాసి: భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు?
బాబూజీ: 1) భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అక్కడ నువ్వు లేవు, లేకపోతే నువ్వు ఆపేసేవాడివి.
2) ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన జీవించాలి గనుక.
మీకు వాచీ అవసరం ఏమిటి?
అభ్యాసి: బాబూజీ మీకు వాచీ అవసరం ఏమిటి?
బాబుజీ: కొత్తవాళ్ళతో ఎంత సమయం వ్యర్థమయ్యిందీ, లేక సాధకులు కానివారితో ఎంత సమయం వృథా అయ్యిందీ చూసుకోవడానికి.
బాబూజీ, మీరు రోజంతా ఏం చేస్తూంటారు?
నవ్వుతూ, సంతోషంగా, హాయిగా గడిపేస్తూంటాను.
చాలా ప్రశ్నలతో
వచ్చాను.
అభ్యాసి: బాబూజీ నేను మీ వద్దకు చాలా ప్రశ్నలతో వచ్చాను. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా లేదు.
బాబూజీ: నువ్వు చాలా ప్రశ్నలతో వచ్చావు. అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు "నువ్వు" మాత్రమే మిగిలావు.
సముద్రంపై ధ్యానించవచ్చా?
బాబూజీ: మనం దేని మీద ధ్యానిస్తామో దాని సారమే మనకు ఫలితంగా లభిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి నువ్వు సముద్రంపై ధ్యానిస్తే నీకు లభించేది ఉప్పు మాత్రమే.
ఆలోచనారహితస్థితిని ఇస్తారా?
బాబూజీ: నా వద్దకు ఒక వ్యక్తి వచ్చి నాకు ఆలోచనారహిత స్థితి ఇస్తారా అని అడిగాడు. నేను సరదాగా, "అలాగే, అయితే ఒకషరతు; నాకు నువ్వు ఆలోచనలతో కూడిన స్థితిని ఇస్తే, నేను నీకు ఆలోచనలు లేని స్థితిని ఇస్తాను" అన్నాను.
29, జనవరి 2024, సోమవారం
ఒక నూతన మానవాళి - దాజీ
26, జనవరి 2024, శుక్రవారం
ఏది తెలుసుకుంటే ఈ సర్వమూ తెలుసుకోగలుగుతాం?
ఆధ్యాత్మికతలో, సత్యాన్వేషణలో సమాధానాల కంటే ప్రశ్నలే ముఖ్యం అంటారు పెద్దలు. పరమ సత్యాన్ని తెలుసుకునే క్రమంలో యేదొక ఆధ్యాత్మిక పాఠాన్ని అనుసరిస్తున్నప్పటికీ, అనుభవాలు గడిస్తున్నప్పటికీ, అడుగడుగునా ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. సాధకుడికి వీటినే అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలని (Existential questions) కూడా అంటారు. ఉదాహరణకు, నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎందుకు మరణిస్తాను? జీవిత ప్రయోజనం ఏమిటి? పుట్టుకకు, మృతువుకు మధ్య చేయవలసినది ఏమైనా ఉందా? లేక కేవలం మరణించే వరకూ జీవించడమే జీవితమా?జీవితానికి ఏమైనా పరమార్థం ఉందా? ఇలా అనేకమైన ప్రశ్నలు యేదోక దశలో ప్రతీ ఆత్మకు కలుగుతూ ఉంటాయి. వీటికి సరైన సమాధానాలు వచ్చే వరకూ ఆత్మ, సంతృప్తి చెందదు. స్వతఃసిద్ధంగా ప్రతీ ఆత్మకు కలిగేటువంటి ప్రశ్నలు.
ఇటువంటి ప్రశ్నలు ఆత్మ ఆస్తిత్వంలోకి వచ్చినప్పటి నుండీ వస్తూనే ఉన్నాయి, గతంలోనూ వచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి, ఇక ముందు భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకూ ఏ ఆత్మా సుఖంగా విశ్రమించలేదు. ఈ ప్రశ్నలకు నిశ్శబ్దంగా సమాధానాలు వెతుక్కోవడమే మనిషి మనుగడ. ప్రయత్నపూర్వకంగా, సంపూర్ణ స్పృహతో వీటిని అన్వేషించడమే ఆధ్యాత్మిక జీవనం. మిగిలినవారు అంటే సాధన చేయనివారు, తెలియకుండా, స్పృహ లేకుండా పరోక్షంగా వీటి సమాధానాలు రకరకాల మార్గాల ద్వారా వెతుక్కుంతు ఉంటారు. సాధన చేయనివారికి, చేసేవారికి ఉన్న తేడా అంతే.
ఈ ప్రశ్నలే సాధకుడి తపనను తీవ్రతరం చేస్తాయి; లోలోతుల్లోకి వెళ్ళేలా ప్రేరణ కలిగిస్తాయి. సమాధానం కోసం వేచి ఉండే అద్భుతమైన నిరీక్షణను, తద్వారా తపనతో కూడిన సహనాన్ని అలవాటు చేస్తాయి. ఈ విధంగా అబ్బే లక్షణాలన్నీ ఈ సంసార సాగరాన్ని ఈదడంలో గొప్పగా సహాయపడుతూ ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలు, అనుమానం వల్ల కలిగే ప్రశ్నలు కావు; జిజ్ఞాస వల్ల కలిగే ప్రశ్నలు. వీటికి తప్పక సమాధానాలు లభిస్తాయి. అటువంటి అద్భుతమైన ప్రశ్న ఒకటి ముండక ఉపనిషత్తులో దర్శనమిస్తుంది. అది ఈ క్రింది విధంగా ఉంది:
शौनको ह वै महाशालोऽङ्गिरसं विधिवदुपसन्नः पप्रच्छ ।
कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति ॥ 1.1.3 ॥
శౌనకో హ వై మహాశాలోంగీరసం విధివదుపసన్నః పప్రచ్ఛ |
కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి ||1.1.3.||
పైన పేర్కొన్న శ్లోకం ముండకోపనిషత్తులోని మొదటి ఖండంలోని 3 వ శ్లోకం. ఇక్కడ శౌనకుడనే గొప్ప గృహస్థుడు అంగీరస మహర్షిని సమీపించి అడిగిన అద్భుతమైన ప్రశ్న - ఓ భగవాన్, ఏది తెలుసుకుంటే ఈ సర్వాన్నీ తెలుసుకోగలుగుతాం?
ఇది శిష్యుడికి కలిగిన అద్భుతమైన ప్రశ్న. ఇటువంటి ప్రశ్నే ఆదిశంకరులవారు రచించిన వివేకచూడామణి గ్రంథంలో కూడా ఒక శిష్యుడు గురువును ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు ఎవరికి వారు సమాధానం వెతుక్కుందాం.
24, జనవరి 2024, బుధవారం
బాబూజీ ఆధ్యాత్మిక జీవనం
బాబూజీ ఇల్లు - వాతావరణం
బాబూజీ గృహస్థ జీవనం
23, జనవరి 2024, మంగళవారం
బాబూజీ ఉద్యోగ పర్వం
22, జనవరి 2024, సోమవారం
యువ బాబూజీ
బాబూజీ బాల్యం
అనంత శ్రీరామ తత్త్వ ధ్యానం
19, జనవరి 2024, శుక్రవారం
బాబూజీ భౌతిక స్వరూపం
బాబూజీ స్పష్టీకరణలు - 11
18, జనవరి 2024, గురువారం
బాబూజీ స్పష్టీకరణలు - 10
17, జనవరి 2024, బుధవారం
బాబూజీ స్పష్టీకరణలు - 9
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...