26, జులై 2025, శనివారం

డా. అరుణ గారు ఒక ఆదర్శ అభ్యాసి

 


డా. అరుణ గారు ఒక ఆదర్శ అభ్యాసి
*
డా. అరుణ గారు హైదరాబాదులోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉండే గైనకాగిస్ట్ డాక్టర్, ఒక ఆదర్శ అభ్యాసి, మంచి మనీషి, గొప్ప సంఘసేవకురాలు. ఆమె తన వైద్య సేవలను ఆర్యన్ నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రి ద్వారా అందిస్తూండేవారు. చాలా కాలంగా ఈ ఆసుపత్రి ఇక్కడ జనానికి సేవలందిస్తూ ఉంది. అంటే కాదు, ఆమె హార్ట్ఫుల్నెస్ సంస్థలో స్వచ్ఛంద వైద్య సేవలు కూడా అందించేవారు. ఇది గాక ఇక్కడ స్థానిక హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రంలో ప్రతీ శనివారం నిరాడంబరంగా కిచెన్ లో కూరలు తరిగుతూ అందరి అభ్యాసుల మనసులను చూరగొన్న వ్యక్తి. ఎందరికో స్ఫూర్తి. 2010 నుండి శ్రీరామ చంద్ర మిషన్ అభ్యాసయిగా సాధన చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి  2014  నుండి బాగా పరిచయం. క్రమం తప్పకుండా ధ్యాన సిట్టింగులకు మా యింటికి వస్తూండేవారు. వయసు పెద్దదైనా, సాధనలో తేడా రానిచ్చేవారు కాదు. మాస్టర్ గారి పట్ల విపరీతమైన భక్తి ప్రపత్తులుండేవి, తపన ఉండేది. ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. కొన్ని రోజుల క్రితమే కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. జూలై 25, 2025 న ఆమె తన దేహాన్ని చాలించారు. ఆమె ఆత్మ యొక్క అనంత యాత్ర, పూజ్య గురుదేవుల మార్గదర్శనంలో సునాయాసంగా ముందుకు సాగాలని ప్రార్థిస్తూ ... వారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో అవసరమైన మానసిక నిబ్బరం ఆ భగవంతుడు ప్రసాదించుగాక. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డా. అరుణ గారు ఒక ఆదర్శ అభ్యాసి

  డా. అరుణ గారు ఒక ఆదర్శ అభ్యాసి * డా. అరుణ గారు హైదరాబాదులోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉండే గైనకాగిస్ట్ డాక్టర్, ఒక ఆదర్శ అభ్యాసి, మంచి మనీషి, ...