Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3
అద్భుతం ఏమిటంటే - ఈ గ్రంథం యే విధంగా చదవాలి? బ్రైటర్ వరల్డ్ లో ఉండే మహాత్ములు, ఇక్కడుండే ఇతర ఆత్మల స్వభావం ఎలా ఉంటుంది? ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? ఇత్యాది ప్రశ్నలన్నీటికీ కూడా మనకీ గ్రంథ శ్రేణిలోనే లభిస్తాయి. ఇవి గాక మన మాస్టర్లు తరచూ ఇచ్చే సమాధానాలున్నాయి.
క్లుప్తంగా ఈ గ్రంథం ఎలా చదవాలి?
ధ్యానస్థితిలో చదవాలి. సాధ్యమైనంత వరకూ ఉదయం ధ్యానం తరువాత చదవాలి. ఎందుకంటే అప్పుడు తాగా ధ్యాన చేసిన తరువాత ధ్యానస్థితిలో ఉంటాం కాబట్టి. అప్పుడు పంక్తుల్లో ఉండే అర్థమే గాక పంక్తుల మధ్య అదృశ్యంగా ఉండే అర్థాలు కూడా అర్థం చేసుకునే విధంగా చదవాలంటారు బాబూజీ విస్పర్శ్ లో.
ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది?
ఈ గ్రంథం ప్రకారం, ఇక్కడ భూమ్మీద ఒకప్పుడు అవతరించి ఎన్నో మహత్కార్యాలు చేసిన మహాపురుషులందరూ ఉంటారు. వీళ్ళు గాక బ్రైటర్ వరల్డ్ దాటి, ఇంకా ఆవల ఉన్న ఎందరో ఇంకా అవతరించని మహాత్ములు కూడా ఉంటారు. వీరందరూ గాక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితులను పొంది ఇక్కడ ఉండటానికి యోగ్యతను సంపాదించుకున్న ఆత్మలు కూడా ఉంటాయట. ఇప్పటికే ఎందరో అటువంటి అభ్యాసులు కూడా ఇక్కడున్నారని విస్పర్శ్ గ్రంథం చెబుతోంది. అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడున్నవారందరూ ఒక్కటిగా, ఎటువంటి బేధాభిప్రాయాలూ లేకుండా ఒకే దిశగా పని చేయడం; ముఖ్యంగా భూగ్రహంపై ఉన్న మానవాళి వికాసం కోసం, ఆ ఎగ్రెగోర్ సాధించే వరకూ వారు వాళ్ళ వాళ్ళ లోకాలను వదిలి ఇక్కడ కలిసిగట్టుగా పలు విధాలుగా పని చేస్తున్నారు. అందులో భాగమే ఈ సందేశాలను ప్రసరించడం కూడా. ప్రపంచ చరిత్రలోనే ఇన్ని వేల సందేశాలను, అది కూడా మానవాళి శ్రేయస్సును ఉద్దేశించినవి అందుకోవడం ఇదే మొదటిసారి.
వీళ్ళందరూ నివసిస్తున్న లోకాన్ని
చిత్రించడం అంతా తేలికైన విషయం కాదు.ఈ దివ్యలోకంలో కోరిక, అసూయ, ద్వేషం అనేవి అస్సలుండవు. సోదరభావం, ఓరిమి, సమగ్రమైన అవగాహన అనేవి ప్రేమకు ఆలాపనగా
ఉంటాయి. పరపూర్ణత కోసం మాలో అన్వేషణ శాశ్వతంగా ఉంటంది. దివ్యత్వంతో ఏకమై ఉండిపోవాలన్న పవిత్ర స్ఫూర్తి మాలో కణకణాల్లో నిండుగా ఇమిడి ఉంటంది. మేము ఒకే సూక్ష్మ శక్తితో ప్రకంపిస్తూ ఉంటాం. ఒక శాశ్వతమైన స్వర్గతుల్యమైన స్వరం మాలో నుండి వచ్చే గీతాలను ఒక్కటి చేస్తుంది. మేమందరమూ ఒక్కటిగా ప్రేమిస్తూంటాం. యే స్థానంలోనైనా కేవలం అక్కడ ఉండే సౌందర్యాన్ని, పవిత్రతను మాత్రమే చూస్తాం.
మన మానవ సోదరులందరూ లేక ఇతర లోకాల్లో పరిణతి
చెందుతున్నవారందరూ కూడా, ఇంచుమించుగా సహించలేని జీవన విధానాలకు గురవుతూ ఉన్నంతవరకూ,
వాళ్ళు తమ శృంఖలాల నుండి విముక్తులయ్యే వరకూ, ఈ దివ్యలోకంలో ఉండే దివ్య అద్భుతాలను
నిజంగా వాళ్ళు అనుభవించలేరు.
(ఇంకా ఉంది ... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి