పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - కొన్ని పలుకులు
పూజ్య గురుదేవులు చారీజీ నాకు వ్రాసిన లేఖల్లో నాలో ఏమాత్రం పరివర్తన రావడానికి కారణమైన కొన్ని మహత్తర వాక్యాలు.
ప్ర: భౌతిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం రెండిటిపైన సమదృష్టి పెట్టి జీవించాలంటున్నారు. నా మనసు సహజంగా ఆధ్యాత్మికత వైపే మొగ్గుతోంది. నాకు చేతకావడం లేదు. దయచేసి మార్గదర్శనం చేయగలరు.
చారీజీ: నీ సమయాన్ని సమంగా రెండు పార్శ్వాలపైన ఉంచడానికి ప్రయత్నించు. మనసు అధికంగా ఆధ్యాత్మిక వైపు మొగ్గుతూ ఉంటే అపపిడు భౌతిక జీవనంపై దృష్టి సారించు; అలాగే ఎక్కువగా భౌతిక జీవనం వైపు మొగ్గుతూ ఉంటే ఆధ్యాత్మికత వైపుకు మనసును మరల్చడానికి ప్రయత్నించు.
నీ పురోగతికై ప్రార్థిస్తాను.
ఆశీస్సులతో పార్థసారథి.
ప్ర: పర్ఫెక్షన్ (పరిపూర్ణత) అంటే ఏమిటి?
చారీజీ: పరిపూర్ణత అంటే నా గురుదేవుల ప్రకారం, పరిపూర్ణ అంతరంగ సమత్వం. (Perfect inner balance )
ప్ర: భయాన్ని పోగొట్టుకోవడం ఎలా?
చారీజీ: నిరంతర స్మరణ ద్వారా భయాన్ని తొలగించుకోవచ్చు. దయచేసి ప్రయత్నించు.
ప్ర: ప్రతీదీ విధిరాత ప్రకారమే జరిగేటప్పుడు ఇక మనిషి చేసేదేముంటుంది?
చారీజీ: నుదుటిరాత లేక విధి అనేవి ఎవరికి వర్తిస్తాయంటే, ఎవరైతే తమ విధిని లేక నుదుటిరాతను మార్చుకోడానికి యే ప్రయత్నమూ చెయ్యరో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
నీ పురోగతికై ప్రార్థిస్తాను.
ఆశీస్సులతో పార్థసారథి.
ప్ర: నా భౌతిక జీవనంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. ఏమి చేయమంటారు?
చారీజీ: నీ భౌతిక పరిస్థితులు బాగుపడటం కోసం, జయాపజాయలను గురించి ఆలోచించకుండా నిరంతరం నీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. దీనికి మాస్టర్ పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి.
నీ విజయం కోసం ప్రార్థిస్తాను
పార్థసారథి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి