బాబూజీ సందేశమాలిక 7 - అభ్యాసి పాత్ర
(బెంగుళూరు, 23 డిశంబర్ 1964)
Role of an abhyasi
(Bangalore, 23 December 1964)
The abhyasi's part is to be perfectly obedient to the Master. I mean to say that he should comply with the directions given to him, having faith, or at least trust, in the Master, and confidence in himself. We have to search for such a good Master who has his approach to the final limit. It is very difficult to find such a Master, and in the words of Upanishads it is difficult to find disciple. But if burning desire is there for realisation, the Master will reach the seeker's door. Trust and distrust are two things and both things are necessary. But what we generally do is that we trust where distrust is needed, and distrust where trust is needed.
మాస్టరు పట్ల పరిపూర్ణమైన విధేయత కలిగి ఉండటం అభ్యాసి పాత్ర. అంటే నా ఉద్దేశం, విశ్వాసంతో కనీసం మాస్టరుపై నమ్మకంతోనూ, తనపై ఆత్మవిశ్వాసంతోనూ ఆయన చెప్పిన మార్గదర్శకాలను అనుసరించాలి. అటువంటి మంచి మాస్టరును, చిట్టచివరి మెట్టు వరకూ చేరుకున్న వ్యక్తిని వెతకవలసి ఉంది. అటువంటి మాస్టరును వెతకడం కష్టం, కానీ ఉపనిషత్తులు చెప్పినట్లుగా అటువంటి శిష్యుడు దొరకడం కూడా కష్టమే. కానీ సాక్షాత్కారం కోసం తీవ్రమైన తపన ఉంటే మాస్టరే స్వయంగా సాధకుడి గుమ్మంలోకి వెతుక్కుంటూ వస్తాడు. నమ్మకం, అపనమ్మకం అనేవి రెండు విషయాలు. రెండూ అవసరమే కూడా. కాని సాధారణంగా మనం నమ్మవలసిన చోట అపనమ్మకము, నమ్మకూడని చోట నమ్మడమూ చేస్తూ ఉంటాం.
ahaa !
రిప్లయితొలగించండి