బాబూజీ సందేశమాలిక 13
నేతి నేతి - Neti Neti
(విజయవాడ, 27 నవంబర్ 1968 , Vijayawada, 27 November 1968 )
There are several persons who do not want to test the efficacy of our Sahaj Marg system - the remodeled system of Raja Yoga - because they are satisfied with what they do. Due to their habits they feel satisfaction in the worship they do out of their avowed method. They take it to be the spiritual improvement which is really not there. They take satisfaction as mark of peace. But satisfaction relates to the senses of grosser type, while peace is close to the soul. If this worship is neglected for a day they feel restless. But if the peace be there, there is no question of restlessness. As we develop in spirituality, the nature of peace also changes and, in the end, non-peace is the result. If we want to advance in spirituality we should begin from Infinity in finiteness. In this way we establish relation with the Real Being.
Our next step will be that we may begin to absorb ourselves in Infinity as the idea of finiteness will be washed away. Now the door is opened and we have come to the path. When finiteness is dissiapted from the mind, the way lies clear. We proceed in the Infinite with the result that even the idea of Infinity cannot pop up. Now the Reality dawns. Further on, when we jumped into the Reality the play ends and the scene begins. But this is not the end. Go on and on. Not only this, not only this - Neti, Neti.
చాలా మంది పునః వ్యవస్ఠీకరించిన రాజయోగ పద్ధతియైన సహజ మార్గ పద్ధతి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి కూడా ఇష్టపడరు - ఎందుకంటే వాళ్ళు చేస్తున్నదానితో వాళ్ళకు తృప్తిగా ఉండటం వల్ల. వాళ్ళు స్వీకరించిన ఆరాధనా పద్ధతి అలవాటైపోవడం వల్ల వాళ్ళకు సంతృప్తిగా ఉంటుంది. దాన్నే వాళ్ళు ఆధ్యాత్మిక ఎదుగుదలగా భావిస్తూ ఉంటారు; నిజానికి అక్కడ అది లేకపోయినప్పటికీ. సంతృప్తే శాంతికి సంకేతం అనుకుంటారు. కానీ నిజానికి సంతృప్తి అనేది గాఢమైన ఇంద్రియాలకు సంబంధించినది, శాంతి అనేది ఆత్మకు దగ్గరగా ఉండేది. ఒక్కరోజు ఈ ఆరాధన ఆపేసినట్లయితే, వారిలో అశాంతి పెరిగిపోతుంది. అదే శాంతి కలిగినట్లయితే అశాంతి ప్రశ్నే ఉండదు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ శాంతి యొక్క స్వభావం కూడా మారుతూ ఉంటుంది; చివరికి శాంతికి అతీతమైన స్థితి ఫలితంగా కలుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలంటే పరిమితిలో ఉన్న అపరిమితత్వంతో ప్రారంభించాలి. ఈ విధంగా మనం నిజ ఆస్తిత్వంతో అనుబంధం ఏర్పరచుకోవడం జరుగుతుంది.
మనం వేయవలసిన తరువాతి అడుగు ఏమిటంటే. పరిమితి అన్న భావన పూర్తిగా తొలగిపోవడం వల్ల, మనలను మనం అపరిమితత్వంలో పూర్తిగా లీనమైపోవడం. ఇప్పుడు ద్వారం తెరుచుకుని సరైన పథంలో అడుగు పెడతాం. మనసులో నుండి పరిమితి అనే భావన పూర్తిగా తొలగిపోవడం వల్ల మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అలా అపరిమితత్వంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఒక దశలో అపరిమితత్వం అనే భావన కూడా ఇక మన ముందుకు రాదు. ఇప్పుడు సత్యతత్త్వం యొక్క దర్శనం ప్రారంభమవుతుంది. ఇంకా ముందుకు సాగుతూ సత్యతత్త్వంలోకి దూకినప్పుడు అసలు దృశ్యం ప్రారంభమవుతుంది. కానీ ఇది కూడా అంతం కాదు. అలా ముందుకు సాగుతూనే ఉంటాం - ఇది కాదు, ఇది కాదు అంటూ - నేతి, నేతి అంటూ కొనసాగుతూనే ఉంటాం.
మనం అంతా కూడా మన మాస్టర్లకు ఎంతో రుణపడి ఉంటాం. ఏమి చేసినా ఆ ఋణాన్ని తీర్చుకోలేం. అలాగే కృష్ణా రావు గారు ఒక యజ్ఞం ప్రాతిపదికగా వీటిని మనకు అందిస్తున్నారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి