బాబూజీ సందేశమాలిక 24
బెంగుళూరు యోగాశ్రమ ప్రారంభం
(12 సెప్టెంబర్ 1976 )
Inauguration of Yogashram at Bagalore
(12 September1976 )
We should do our duty to uplift the mankind not minding whether they are doing their duty towards us properly. I believe that it is the highest moral which we should achieve though with some troubles and sacrifices on our part. This is a part of saintliness. When we work, it is but natural that some hurdles are also there. Gradually they diminish. There are good people everywhere hankering for Him. If we do service, the success will surely dawn.
మానవాళిని ఉద్ధరించడానికి మన ధర్మం మనం నిర్వర్తించాలి, అవతలి వాళ్ళు మన పట్ల వాళ్ళ ధర్మం సక్రమంగా నిర్వర్తించకపోయినా సరే. ఇది మనం సాధించవలసిన అత్యున్నత నైతికత అనుకుంటున్నాను, కొన్ని కష్టాలు, కొన్ని త్యాగాలు మన వంతుగా చేయవలసి వచ్చినప్పటికీ కూడా. సాధుత్వంలో ఇదొక భాగం కూడా. మనం పని చేస్తున్నప్పుడు సహజంగానే కొన్ని ఆటంకాలు రావడం కూడా సహజమే కదా. క్రమక్రమంగా అవి తగ్గుముఖం పడతాయి. భగవంతుని కోసం తపించే మంచి మనుషులు అన్నీ చోట్లా ఉన్నారు. మనం సేవలనందిస్తే, విజయం తప్పక కలుగుతుంది.
అత్యున్నతమైన బోధన మనకు అందించారు. మన పని లేదా ధర్మ మనం నిర్వర్తించాలి. ఇతరుల గురించి పట్టించుకోవద్దు అన్నారు. ఒక విధంగా ఇదొక రహస్యం... మనం గుర్తించక అది అందించే ప్రయోజనాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు సద్వినియోగ్లం చేసుకుందాం.
రిప్లయితొలగించండి