19, ఏప్రిల్ 2024, శుక్రవారం

బాబూజీ సందేశమాలిక 26 - సత్సంగ భవన ప్రారంభోత్సవం, టిన్సుకియా - Satsangh Bhavan Inauguration Tinsukia

 



బాబూజీ సందేశమాలిక 26 
సత్సంగ భవన ప్రారంభోత్సవం, టిన్సుకియా 
ప్రేమ, భక్తి 

(25 నవంబర్ 1977 )
Satsangh Bhavan Inauguration Tinsukia 
Love and Devotion
(25 November 1977 )

... it is certain that in Sahaj Marg, the fragrance of Pranahuti indwells, but still the factors that get left behind are love and devotion. Along with the act of meditation, it is essential that these should also inhere therein. It is your responsibility to engender these factors in yourselves. The means consists in endeavouring to maintain the remembrance of the Principle, that is, Ishwar(God).

Whatever act you do, do it in the thought "It is the Divine's command and therefore it is my duty to do so," that the state of remembrance should continue steadfast. And one special benefit that accrues is that the creation of samskaras (impressions) ceases. Retaining the remembrance of God at all times engenders in us a deep attachment to the Divine and leads to the state in which love for Him develops and overflows. Gradually through this, devotion attains its full form. It is therefore very essential to adopt this procedure. 

సహజమార్గ పద్ధతిలో ప్రాణాహుతి పరిమళం అంతర్లీనంగా ఉంటుంది నిజమే, కానీ ప్రేమ, భక్తి అనేవి సాధనలో మిగిలిపోతాయన్నది కూడా నిజమే. ధ్యానంతోపాటుగా వీటిని కూడా మనలో లీనం చేసుకోవడం చాలా అవసరం. వీటిని మీ అంతరంగంలో నిలుపుకునే బాధ్యత మీరే తీసుకోవలసి ఉంది. దీన్ని అనుసరించే మార్గం ఏమిటంటే దైవం అనే సూత్రాన్ని ఎప్పుడూ స్మరణలో ఉంచుకోవడం.
 
 మీరు చేస్తున్న ప్రతీ పని, "దైవాజ్ఞ కాబట్టి దీన్ని చేయవలసిన ధర్మం నాది కూడా" అన్న భావనతో చెయ్యండి. అప్పుడు స్మరణ స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యేక ప్రయోజనం ఏమిటంటే, ఇక సంస్కారాలు ఏర్పడటం ఆగిపోతాయి. దైవస్మరణ నిరంతరమూ నిలుపుకోవడం వల్ల దైవంతో లోతైన అనుబంధం పెరగుతుంది, అదే మనలో దైవం పట్ల ప్రేమ వెల్లువై  ప్రవహిస్తుంది. తద్వారా భక్తి కూడా పెంపొంది పూర్తి రూపాన్ని దాలుస్తుంది. అందుకే ఈ ప్రక్రియను అనుసరించడం చాలా అవసరం. 

1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...