2, ఏప్రిల్ 2024, మంగళవారం

సందేశమాలిక 11 - భగవంతుని సరళంగా సాక్షాత్కరించుకోవచ్చు - God can be realised in a simple way

 

సందేశమాలిక 11 

భగవంతుని సరళంగా సాక్షాత్కరించుకోవచ్చు 

(బెంగుళూరు 20 జూన్ 1967)

God can be realised in a simple way

(Bangalore 20 June 1967)

The time has come that man  is awakened to the need of spirituality. The force of creation has created outward tendencies in man. That is why, over the course of time he has created several worlds which has resulted in making him complex. The present imperfect state of mind is the result of his own doings. Unfortunately, the basic fact that God is simple and can be achieved by simple means is lost sight of. 

God is the subtlest being and in order to realise Him the subtlest means are the only way. This does not mean that for realising God one has to ignore the needs of the physical body or the empirical world. If perchance we fall upon the means which go on adding grossness we shall definitely remain away from the vision of Absolute Reality. It is an established fact that meditation is a subtle method, provided the object of meditation is not concrete. That is why under Sahaj Marg we advise to meditate supposing the presence of Divine light in the heart. The upanishads also corroborate this. This practice supported by the transmission of the Divine Effulgence becomes subtler and subtler until it becomes the subtlest. 

మనిషి ఆధ్యాత్మికత యొక్క ఆకసారానికి మేల్కొనే సమయం ఆసన్నమయ్యింది. సృష్టిలోని శక్తి, మనిషిలో  బాహ్య ప్రవృత్తులను బాగా సృష్టించింది. అందుకే కాలక్రమేణా మనిషి అనేక ప్రపంచాలను సృష్టించుకున్నాడు, ఫలితంగా అవన్నీ మనిషిని జటిలంగా తయారు చేశాయి. ప్రస్తుత అపరిపూర్ణమైన మనసుకు కారణం మనిషి స్వయంగా తాను చేసుకున్న కృత్యాలే. దురదృష్టవశాత్తు, భగవంతుడు సరళుడని, ఆయనను తెలుసుకోవడం కూడా సరళమేనన్న మౌలిక యదార్థం మనిషికి  కనుమరుగైపోయింది. 

భగవంతుడు అతి సూక్ష్మ అస్తిత్వం; ఆయన్ని సాక్షాత్కరించుకోవాలంటే అతి సూక్ష్మ మార్గం మాత్రమే ఏకైక మార్గం. అంటే దీనర్థం శారీరక అవసరాలను లేక ప్రాపంచిక  అవసరాలను గాని నిర్లక్ష్యం చేయమని కాదు. ఒకవేళ దురదృష్టవశాత్తు రోజురోజుకూ మనలో జడత్వాన్ని పెంపొందించే మార్గంలో ఉన్నామనుకోండి, తప్పనిసరిగా ఆ పరమ అస్తిత్వం నుండి దృష్టి మరలిపోయి దూరంగా ఉండిపోతాం. ధ్యాన వస్తువు జడమైనది కాకపోయినట్లయితే, ధ్యానం అనేది చాలా సూక్ష్మ పద్ధతి అనేది స్థాపించబడిన సత్యం. అందుకే సహజ మార్గంలో హృదయంలో ఒక దివ్య వెలుగుందన్న భావనపై ధ్యానించమంటాము. ఉపనిషత్తులు కూడా దీనితో ఏకీభవిస్తాయి. ఈ సాధన దివ్య తేజస్సు యొక్క ప్రసరణ సహాయంతో మరింత మరింత సూక్ష్మంగా తయారై, సూక్ష్మాతిసూక్ష్మంగా అయ్యేవరకూ కొనసాగుతుంది. 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...