హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ భండారాలు
ఆధ్యాత్మిక సమావేశాలు
భండారా అంటే ఏమిటి?
భండారా అంటే ఆధ్యాత్మిక శక్తితో నిండిన భాండాగారం
అని అర్థం.
ఇందులో పాల్గొన్నవారికి విశేష ఆధ్యాత్మిక కృప
లభించే అవకాశం ఉంటుంది.
సరళంగా చెప్పాలంటే భండారా అంటే పెద్ద ఎత్తున జరిగే
ఒక ఆధ్యాత్మిక సమావేశం
ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి
ఉంది.
సాధారణంగా ఒక మహానీయుడి, అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క జన్మదినోత్సవాన్ని, ఆయన దివ్య స్మరణలో జరుపుకుంటారు.
ఇది సాధారణంగా మూడు రోజుల పాటు ఉంటుంది.
మధ్య రోజున అసలు పుట్టిన దినం ఉంటుంది.
ఈ మూడు
రోజుల్లో ఈ మహానీయుని అనుసరించేవారందరూ సకుటుంబ సమేతంగా భండారా జరిగే చోటకు వచ్చి
వారి స్మరణలో గడుపుతారు.
భండారాల్లో కొంతమంది అన్నదానం చేస్తారు, లంగర్ అంటారు, కలిసి భజనలు, ప్రవచనాలు, ధ్యానాలు చేస్తారు.
హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ భండారాలు
హార్ట్ఫుల్నెస్, శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థల్లో భండారాలు, మన ఆది గురువైనటువంటి పూజ్య లాలాజీ సమయం నుండి జరుగుతూ ఉన్నాయి.
ఆ తరువాత పూజ్య బాబూజీ, ఆ తరువాత పూజ్య చారీజీ, ఇప్పుడు పూజ్య దాజీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం మన సంస్థలో లాలాజీ జయంతి, బాబూజీ జయంతి, చారీజీ జయంతి, దాజీ జన్మదినోత్సవం నాడు ఈ భండారాలు జరుగుతూ ఉంటాయి.
ఇంతకు పూర్వం దేశంలో వివిధ నగరాల్లో జరుగుతూ
ఉండేవి. ఇప్పుడు అన్ని భండారాలు హైదరాబాదులోని, కాన్హా శాంతి వనంలోనే జరుగుతున్నాయి.
పూజ్య దాజీ ఈ మధ్య ఆరునెలలకొక భండారా జరుపుతామని
ప్రకటించడం జరిగింది. మొదటి ఆరు నెలల్లో,
బసంత్
పంచమి నాడు లాలాజీ, బాబూజీల జయంతులు, రెండవ ఆరునెలల్లో, చారీజీ, దాజీ జన్మదినోత్సవాలు సెప్టెంబరులో జరుపబోతున్నారు.
భండారాలో ఏం చేస్తారు?
ఇటువంటి భండారాల్లో ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. దీని ప్రభావం రానున్న రోజుల్లో ప్రతి అభ్యాసి తన జీవితంలో ఆధ్యాత్మిక పరిణతి రూపంలో అనుభవంలోకి రావడం గమనించడం జరుగుతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి.
భండారా అనేది సాధారణంగా ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సుగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.
భండారా ప్రధాన రోజుకు ముందు రోజు సాయంకాలం
ప్రారంభమై, మూడవ రోజు ఉదయంతో ముగించడం
జరుగుతుంది.
ఇక్కడ అభ్యాసీలందరూ కలిసి కూర్చొని నాలుగు పూటలా
ధ్యానం చేసుకుంటారు; ఈ ధ్యానాన్ని పూజ్య
గురుదేవులు దాజీ నిర్వహిస్తారు.
భండారా సందేశాన్ని విడుదల చేయడం జరుగుతుంది.
కొత్త గ్రంథాలు ఏమైనా ఉంటే విడుదల చేయడం
జరుగుతుంది.
సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవచ్చు. ఉదయం
భజనలు కొంత మంది అభ్యాసులు ఆలపించవచ్చు.
భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఈ
మూడు రోజులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
భండారా ప్రాముఖ్యత
భండారా అనేది ప్రతి అభ్యాసికి తన గురువు పట్ల
ప్రత్యేకంగా నిశ్శబ్దంగా తన హృదయంలోనే కృతజ్ఞతను వ్యక్తం చేసే అవకాశం. ప్రత్యేకంగా
ఎవరి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామో,
వారి
జీవితాన్ని నిజంగా తమ హృదయంలో స్మరించుకోవాలసిన సందర్భం.
అభ్యాసి ఇప్పటి వరకూ తన ఆధ్యాత్మిక యాత్ర ఎక్కడి వరకూ వచ్చింది, సాధన యే విధంగా కొనసాగుతున్నది సరి చూసుకోవడం; చేసిన పొరపాట్లను గుర్తించడం; రానున్న రోజుల్లో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడం; శీలనిర్మాణ విషయాన్ని ప్రత్యేకంగా ఏకాంతంగా బేరీజు
వేసుకోవడం; వంటి ఆత్మావలోకనం డైరీలో
వ్రాసుకుంటూ గడపవచ్చు.
స్వచ్ఛంద సేవలనందిస్తూ ఇతరుల సేవలో ఉండటంలో కలిగే ఆనందాన్ని
ఆస్వాదిస్తూ, గురువు పట్ల కృతజ్ఞతను హృదయంలో
అనుభూతి చెందే ప్రయత్నంలో ఉండవచ్చు;
అనుభవజ్ఞులను సంప్రదించి, సూక్ష్మాలు తెలుసుకోవడం; భండారా సందేశాన్ని పదే పదే చదివి, మూడు రోజులూ గురుదేవుల
సందేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయడం.
రకరకాల స్థానాల నుండి, దేశాల నుండి వచ్చిన అభ్యాసులతో కలుసుకుంటూ
సోదరభావాన్ని పెంచుకోవడం చేయవచ్చు.
పైవి గాకుండగా ఆధ్యాత్మిక పురోగతి దిశగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి
తోడ్పడే యే కార్యక్రమాలనైనా అనుసరించవచ్చు.
భండారాల్లో ధ్యానాల ప్రత్యేకత
పూజ్య దాజీ నిర్వహించే యే ఒక్క ధ్యానంలో పాల్గొనడం మానరాడు. అన్నీ ధ్యానాల్లో పాల్గొనాలి.
ఈ ధ్యానాలు చాలా ప్రత్యేకమైనవి; ఈ ధ్యానాలు దైవకృప
అమితంగా వర్షించేటువంటి సందర్భాలు.
కృప అంటే మనకు అర్హత లేకపోయినా కలిగే ఆధ్యాత్మిక
ప్రయోజనం. అటువంటి కృప మెండుగా ఈ మూడు రోజులూ వర్షిస్తుంది. కనుక ఈ ప్రాంగణం వదిలి ఎక్కడికీ వెళ్ళరాదు, ఈ మూడు రోజులూ.
భండారా పూర్తయిన తరువాత నేరుగా ఇంటికి వెళ్ళాలి; వెళ్ళిన తరువాత సాధ్యమైనంత ఎక్కువగా ఇంట్లో ధ్యానించాలి; అప్పుడే భండారాల్లో ధ్యానాల్లో కలిగిన ఆధ్యాత్మిక స్థితులు
జీర్ణమై మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడటం జరగడం, అందరూ అనుభూతి చెందవచ్చు.
భండారాలకు వచ్చే ముందు కూడా ప్రిసెప్టర్ల వద్ద
సాధ్యమైనన్ని ఎక్కువ సిట్టింగులు తీసుకుని రావడం మంచిది; అలాగే రోజూ చేసే సాధన క్రమం తప్పకుండా చేసి రావడం మంచిది. సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయోజనం
పొందాలంటే ఇది చాలా అవసరం.
అభ్యాసిగా భండారాలో యే విధంగా గడపాలి?
పైన చెప్పిన భండారా ప్రాముఖ్యతను దృష్టిలో
పెట్టుకుని మెలగాలి.
క్రమశిక్షణ కలిగి ఉండాలి.
దాజీ కనిపిస్తే దూరం నుండే మనసులో నమస్కారం
చేసుకోవాలి; వారి దృష్టిని ఆకర్షించే
ప్రయత్నం చేయవద్దు.
అక్కడున్న పచ్చదనాన్ని ప్రతి ఒక్కరికీ కాపాడవలసిన బాధ్యత ఉంది.
వలంటీర్లతో సహకరించే ప్రయత్నం చేయాలి.
వాద-వివాదాలు, బిగ్గరగా మాట్లాడటం
మానుకోవాలి; ఎక్కడి పడితే అక్కడ చెత్త పారవేయకుండా
సహకరించాలి. పరిశుభ్రతను సంరక్షించాలి; భోజనం అవసరమైనంత
వేయించుకోవాలి; ఆహారం వృథా చేయరాదు; నీరు పొదుపుగా వాడాలి;
వాష్ రూముల్లో ఎక్కువ సమయం గడపరాడు; బట్టలు ఉతకరాదు; వెనుక చాలా మంది వేచి
ఉన్నారన్న ధ్యాసతో పనులు ముగించుకోవాలి.
అభ్యాసి దృష్టి అంతా కూడా అంతర్ముఖమై ఉండాలి. ఎన్ని
సిట్టింగులు అవసరమైతే అన్ని సిట్టింగులు తీసుకోవచ్చు. సత్సంగాల ముందు, తరువాత కూడా.
అనుభవజ్ఞులతో చర్చించి సందేహ నివృత్తి చేసుకోవచ్చు.
సాధకునికి, అన్వేశికి, అభ్యాసీకి ఎంతగానో, ఎన్నివిదాలుగానో సహకారం అందించే రోజు. కృష్ణారావు గారు అన్ని అంశాలు వివరంగా చెప్పారు... ఇందులో మనం కళ్ళు హృదయం చెవులు తెరుచుకుని పాల్గొంటే జరిగే మేలు బేరీజు వేయలేము.
రిప్లయితొలగించండి*భండారా యొక్క అర్థము మరియూ దాని ప్రత్యేకత, దాని ఆధ్యాత్మిక పరమార్థం గురించి సవివరంగా, క్రొత్త పాతతరం అభ్యాసులకు అర్ధమయ్యే రీతిలో తెలియచేసినందుకు ధన్యవాదాలు బ్రదర్*
రిప్లయితొలగించండి