బాబూజీ సందేశమాలిక 27
79 వ జన్మదినోత్సవం బెంగుళూరు
గృహస్థ జీవనం
(30 ఏప్రిల్ 1978)
79 th Birth Anniversary Bangalore
Family life
(30 April 1978)
Life in a family is a life worth having, because in it we learn how to love others. It is a school for training for real life. You have to remove only the brokenness and you will feel the love flowing equally to one and all, and it becomes universal. Life in a family also brings worry and nervousness, etc., in its trail. Worry is indeed reserved for humanity and not for animals. Really, that is a great justice and favour for humanity from Divinity. Why so? Because it is a part of wisdom that takes a man to a higher sphere. A piece of cloth is prepared by the wisdom of the weaver. His hands are at work, but he displays his wisdom by the movement of his hands. Wisdom has its own centre, but it guides manual efforts as well, where it is needed.
గృహస్థు జీవనం జీవించదగ్గ జీవనం, ఎందుకంటే ఇందులోనే మనం ఇతరులను ప్రేమించడం నేర్చుకోగలుగుతాం. నిజమైన జీవితానికి ఇది ఒక శిక్షణాస్థలి. కేవలం పగుళ్ళను తొలగించాలంతే, అందరి పట్ల ప్రేమ సమానంగా పొంగిపొరలడం, ఆ ప్రేమ విశ్వప్రేమగా మారడం మీరు అనుభూతి చెందగలుగుతారు. కుటుంబ జీవనం తనతోపాటు చింతలను, మనోదౌర్బల్యాన్ని కూడా తీసుకువస్తుంది. చింత అనేది మనుషులకే నిర్దేశించినది, జంతువులకు నిర్దేశించినది కాదు. నిజంగా, ఇది దైవం మానవాళికి చేసిన గొప్ప న్యాయం, గొప్ప ఉపకారం. ఎందుకని? ఎందుకంటే, మనిషిని ఉన్నత స్థితులకు తీసుకువెళ్ళగలిగే విజ్ఞతలో భాగం గనుక. నేతగాడు తన విజ్ఞతతో ఒక బట్టను నేస్తాడు. అతని చేతులు పని చేస్తాయి, కానీ ఆతని చేతుల కదలికల్లో ఆతని విజ్ఞత కనిపిస్తూ ఉంటుంది. విజ్ఞతకు తనదైన కేంద్రం ఉంది, కానీ అవసరమైన చోట, మనిషి భౌతికంగా చేసే కృషిలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనోదౌర్బల్యాన్ని మీరే స్వయంగా తొలగించుకోవాలి.
ఆహా ! విజ్ఞత గురించి ఎంత విశిష్టంగా చెప్పారో కదా ! ఇలాంటి ముఖ్యమైన అంశాలను ఇలా ఒక్కొక్కటిగా మెల్లగా చూస్తె తప్ప మన స్ఫురణకు తట్టవు. చింత, విజ్ఞత, నిపుణత అన్నీ మనకు అవసరం అంటున్నారు... వేటి స్థానం వాటికి ఉంది. వీటిలో కొన్ని వద్దనుకున్తున్నాం. కొన్ని కావాలి అనుకుంటున్నాం. అంతా ఒక గంపలో ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి.... అందుకు ధ్యానం !! ఆహా !!
రిప్లయితొలగించండి