5, ఏప్రిల్ 2024, శుక్రవారం

బాబూజీ సందేశమాలిక 15 - ప్రపంచ శాంతి వ్యక్తిగత శాంతి మీద ఆధారపడుంది - World peace is related with the peace of the individual

బాబూజీ సందేశమాలిక 15 
 ప్రపంచ శాంతి వ్యక్తిగత శాంతి మీద ఆధారపడుంది 
 World peace is related with the peace of the individual 
(మే 1969 సందేశం, May 1969 Message)

The world today is in a state of unrest and disorder. Everybody seems to be crying for peace. But all efforts for bringing about peace appear to end in failure. The reason is that all efforts are merely external, touching only the outer surface. In fact, the problem is far from being related to the world in general; really it is the problem of the individual first and of society afterwards. As such it needs to be tackled in that order. World peace is closely related with the peace of the individual for which one has to take account of the inner state of one's mind. If man's mind is brought to the state of peace and order everything in the outside world will get into order in the same colour. But it is sad that the world has lost its real basis, and for its re-establishment, it is necessary to adopt means which may promote the feeling of peace and calmness of mind of the individual man.

What we have to do for the purpose is to introduce proper adjustments in the mental tendencies of the individual, which in effect is the proper moulding and regulation of mind. This is possible when the individual mind develops up to the state of universal mind. Just imagine! There will then be no problem! As it is, individual minds, which themselves lack peace and tranquility are trying to establish peace in the world. Isn't it ridiculous? The only way open to mankind is to take to the spiritual way of life, which is unfortunately absent today, leading to all this chaos.

ఈరోజు ప్రపంచం అల్లకల్లోలంగానూ, అశాంతితోనూ నిండి ఉంది. అందరూ శాంతి కోసం రోదిస్తున్నారు. కానీ శాంతి కోసం చేసే అన్నీ ప్రయత్నాలూ విఫలమవుతున్నట్లుగా తోస్తున్నది. కారణం ఏమిటంటే, ఆ ప్రయత్నాలన్నీ కేవలం బాహ్యమైన ప్రయత్నాలు కావడమే, ఉపరితలాన్ని మాత్రమే స్పర్శిస్తున్నాయి. వాస్తవానికి సమస్య ప్రపంచానికి సంబంధించినది కాదు; నిజానికి ఈ సమస్య వ్యక్తిగతమైనది,  ఆ తరువాతే సమాజానిది. కాబట్టి సమస్యను అదే వరుసలో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రపంచ శాంతి, వ్యక్తి యొక్క శాంతితో చాలా దగ్గరగా ముడి పడుంది; దానికి వ్యక్తి యొక్క అంతరంగ మానసిక స్థితిని లెక్కలోకి తీసుకోవాలి.  మనిషి మనసును గనుక శాంతి, క్రమశిక్షణల్లోకి తీసుకురాగలిగితే, బయట ప్రపంచంలో అన్నీ వాటంతటవే ఉండవలసిన విధంగా అదే క్రమంలో సర్డుకుంటాయి. కానీ ప్రపంచం ఈ మూలాన్ని కోల్పోవడం దురదృష్టకరం. దీన్ని పునరుద్ధరించాలంటే, వ్యక్తిగతంగా మనిషి మనసులో శాంతి, ప్రశాంతతలను పెంపొందింపజేయాలి. 

ఈ ప్రయోజనం సిద్ధించడం కోసం, మనసును మలచడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి అంటే మానసిక ప్రవృత్తులను, మనం సక్రమమైన సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. ఇది వ్యక్తి మనసు విశ్వజనీన మనసుగా తయారైనప్పుడు సాధ్యపడుతుంది. ఒక్కసారి ఊహించండి! అప్పుడిక సమస్య ఉండదు! ప్రస్తుతం ఉన్న స్థితి ఎలా ఉందంటే, వ్యక్తుల మనసుల్లోనే శాంతి, ప్రశాంతటలు లేవు గాని వాళ్ళు ప్రపంచంలో స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా లేదూ? మానవాళికి ఉన్న ఏకైక పరిష్కారం ఆధ్యాత్మిక మార్గం మాత్రమే; దురదృష్టవశాత్తు అది ఈనాడు కనుమరుగైపోయింది, అది కనుమారుగవడమే  ఈ అల్లకల్లోలానికి దారి తీయడానికి గల కారణం. 

1 కామెంట్‌:

  1. కృష్ణా రావు గారు ఇక్కడకు తీసుకు వచ్చారా ! చక్కగా వరసగా ఒక క్రమ పద్ధతిలో తీసుకువచ్చారు. భళా !!

    రిప్లయితొలగించండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...