బాబూజీ సందేశమాలిక 18
సమర్థ గురువు అంటే ఎవరు?
Who is a capable Guide?
(మే 1970 సందేశం, Message May 1970)
Adopt easy means to gain the easy thing. Dogmas can do you no good. It is only the practical thing that can weave your destiny under the guidance of one who has measured the distance, and has discovered the original source.
There are such men in India who can very easily guide you to the Destination, so near and dear to you. But the selection you have to make yourself. For Him to guide you in your search. I may say that where you find the idea of service with no selfish motive of the Guide, there rests the Real Thing.
One more thing to take into account specially, is to know and be sure that one who can foment you with his own internal divine power to make your task easy, is the only capable hand for spiritual guidance. To get such a man is a sure sign of successful solution of the problem of life. For you all I pray that the seekers may get such a Guide. Amen!
తేలికైన వస్తువును పొందాలంటే తేలికైన మార్గాన్ని అవలంబించాలి. పిడివాదాల వల్ల ఎటువంటి మంచీ జరగదు. మూలాన్ని కనుగొన్నవాడు, ఆ దూరాన్ని కొలిచినవాడు, అయిన వ్యక్తి మార్గదర్శనంలో మాత్రమే మీ విధిని మీరు అల్లుకోగలుగుతారు, కేవలం ఆచరణీయమైన పద్ధతి ద్వారానే ఇది సాధ్యపడుతుంది.
మీకు చాలా ప్రియమైనది, అతి సామీప్యంగా ఉండే మీ గమ్యానికి జేర్చగల మార్గదర్శనం చేయగలిగేటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని ఎంచుకోవడం మాత్రం మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. ఆయనను అన్వేషించే క్రమంలో మార్గదర్శనం చేయడానికి, నేను చెప్పేదేమిటంటే, ఏ మార్గదర్శిలో అస్సలు స్వార్థపరత్వం లేకుండా సేవా భావంతో నిండి ఉంటాడో, అక్కడే మనం వెదికే అసలైన వస్తువు ఉంటుందని చెప్పగలను.
ప్రత్యేకంగా మరో విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైతే తనలోపలున్న ఆధ్యాత్మిక శక్తితో మిమ్మల్ని పూరిగొల్పి పనిని సుగమం చేయగలడో అతడే ఆధ్యాత్మిక మార్గదర్శనానికి సమర్థుడైన గురువు. అటువంటి వ్యక్తి తటస్థమవడం జీవిత సమస్యకు పరిష్కారం నిస్సందేహంగా లభించినట్లే. సాధకులందరికీ అటువంటి మార్గదర్శి లభించాలని ప్రార్థిస్తున్నాను. తథాస్తు!
అద్భుతం.
రిప్లయితొలగించండి