18, ఏప్రిల్ 2024, గురువారం

బాబూజీ సందేశమాలిక 25 - 78 వ జన్మదినోత్సవం మదురై - 78 th Birthday Celebrations Madurai

 


బాబూజీ సందేశమాలిక 25
78 వ జన్మదినోత్సవం మదురై 
(30 ఏప్రిల్ 1977 )
78 th  Birthday Celebrations Madurai 
(30 April 1977 )

Most of the brothers and sisters assembled here have, in some way or the other, a lurking desire in their minds to achieve God or the Ultimate. When one has got a mind and a strong sincere desire to reach the state of Realisation, he will surely get the means to take him to the state of Realisation. The maxim goes,'Where there is a will there is a way'. Idea when it leaves its boundary, becomes thought. When thought becomes stronger, the activity for Realisation develops. One who dives deep, gets the pearls. The burning desire for Realisation brings the goal nearer. If anybody wants that he should get benefitted, he should encourage himself to cultivate right faith, right cognition, and right, morals.

The basis of Yoga has always been the right morals and proper behaviour. That is why my Master has laid great stress on this point. He always emphasized cultivating a principled character. The way of life should be pregnant with high morals. If it is not there, a person is not capable of having the fine type of spirituality, which is beyond everything and is worth having. Freedom we want but we do not know its definition. Suffering is the root and results are flowers which every associate should strive hard to have. 

ఇక్కడ సమావేశమైన సోదరసోదరీమణులందరిలో చాలా మంది మనసుల్లో ఎక్కడో ఆ దైవాన్ని లేక ఆ పరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న కోరిక దాగి ఉంది. సాక్షాత్కార స్థితిని పొందాలన్న మనసు, తీవ్రమైన కోరిక ఉన్నట్లయితే, తప్పక ఆ సాక్షాత్కార స్థితికి జేర్చగల మార్గం కూడా తటస్థమవుతుంది. 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్న నానుడి ఉండనే ఉంది. భావం తన పరిధిని దాటినప్పుడు అది ఆలోచనగా మారుతుంది. ఆలోచన శక్తివంతంగా తయారైనప్పుడు, సాక్షాత్కారానికి సంబంధించిన  కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. లోలోతుల్లోకి మునక వేసినవాడికే ఆణిముత్యాలు దొరుకుతాయి. సాక్షాత్కారం పట్ల తీవ్ర తపనే, గమ్యాన్ని మరింత చేరువ చేస్తుంది. ఎవరైనా ప్రయోజనం పొందాలనుకుంటే తనలో, నిజమైన విశ్వాసం, సరైన పరిజ్ఞానము, సరైన నైతిక విలువలు అలవరచుకునేలా తనను తాను, ప్రోత్సహించుకోవాలి. 

సరైన నైతికత, సక్రమమైన ప్రవర్తన అనేవి యోగానికి ఆధారాలుగా ఎప్పటి నుండో ఉన్నాయి. అందుకే నా గురుదేవులు ఈ అంసహాయాన్ని నొక్కి చెప్పేవారు. సరైన సౌశీల్యాన్ని అలవరచుకోవాలని కూడా మరీ మరీ చెప్పేవారు. జీవన విధానం అణువణువునా నైతికతతో నిండి ఉండాలి. అది లేకపోతే, వ్యక్తి సూక్ష్మత్వంతో నిండిన ఆధ్యాత్మికతను పొందడానికి అసమర్థుడవుతాడు. ఇటువంటి ఆధ్యాత్మికత అన్నిటికీ అతీతమైనది, పొందదగ్గది. మనందరికీ స్వేచ్ఛ కావాలి కానీ దాని నిర్వచనం మనకు తెలియదు. బాధలు కష్టాలు, మూలవ అయితే, ఫలితాలు పువ్వుల్లాంటివి; వీటి కోసం ప్రతీ సాధకుడూ బాగా కష్టపడాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...