బాబూజీ సందేశమాలిక 23
షాజహానుపూర్ ఆశ్రమ ప్రారంభం
( జనవరి 1976 )
Shajahanpur Ashram Inauguration
(January 1976 )
It is a hidden dictum of Nature that every soul must live a happy and restful life. If we do otherwise, we are spoiling His world. We are all family people, but we must be moderate in all our dealings and money is essential for us everywhere. So it becomes our duty to have it for our maintenance and good living. But love of money for its own sake is a disease and a sort of sordid ambition according to Dunns.
Necessities of life should be meagre."Plain living and high thinking" is an English proverb. Detachment in attachment is really needed. The happiest man is he who is happy under all circumstances.
ప్రతీ ఆత్మ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలన్నది ప్రకృతిలో దాగివున్న ఒక సిద్ధాంతం. మనం ఇందుకు విరుద్ధంగా చేస్తే ఆయన ప్రపంచాన్ని పాడుచేస్తున్నట్లే. మనందరం గృహస్థులం, కానీ మన వ్యవహారాలు మితంగా ఉండేలా చూసుకోవాలి; అలాగే డబ్బు కూడా మనకి అన్నీ చోట్లా అవసరం అవుతుంది. కాబట్టి మనలను మనం సంరక్షించుకోవడానికి, సరిగ్గా జీవించడానికి, డబ్బు సంపాదించడం మన ధర్మం అవుతుంది. కానీ డబ్బు కోసమే డబ్బును ప్రేమించడం అనేది ఒకరకమైన వ్యాధి; డన్స్ ప్రకారం ఒక నీచమైన అత్యాశ.
జీవితంలో అవసరాలు తక్కువగా ఉండాలి. "సాదా జీవనం ఉన్నత ఆలోచన" అనేది ఒక ఆంగ్ల నానుడి. మోహంలోనే నిర్మోహత్వం నిజంగా చాలా అవసరం. అన్నీ పరిస్థితులలోనూ సంతోషంగా ఉండేవాడే నిజంగా సంతోషంగా ఉండే మనిషి.
ఇంకేముంది ... అన్ని పరిస్థితులలోనూ సంతోషంగా ఉండేవాడే నిజంగా సంతోషంగా ఉండే మనిషి అని చెప్పారు పరమ పూజ్య బాబూజీ. ఆయన 125 జన్మ దినోత్సవం ఈ సంవత్సరం అంతా అందుకే జరుపుకుంటున్నాం. డబ్బు కోసమే డబ్బ్బుని ప్రేమించడం ఒక జబ్బే అన్నారు. అలాగని వద్దనీ అనలేదు.. ఎంత అవసరమో అంత సంపాదించుకోవడం అవసరం అన్నారు. అదీ విషయం... గృహం, కుటుంబ బాధ్యతలు, అవసారాలు తీర్చడం కూడా బాధ్యతే ... అత్యాస వద్దన్నారు. అందుకే ప్రపంచం అంతా ఈ పధ్ధతి వైపు ఇప్పుడు ఆకర్షితమౌతున్నది.
రిప్లయితొలగించండికృష్ణా రావు గారు మీ ఈ యజ్ఞాన్ని కొనసాగించండి.