బాబూజీ సందేశమాలిక 12
సహజ మార్గ మూల సిద్ధాంతాలు
(5 జనవరి 1968, బెంగుళూరు)
Fundamental Principles of Sahaj Marg
(5 January 1968, బెంగళూరు)
The only thing in existence, before creation came into existence, was Divinity in the original state, and everything in essence form was merged in it. The process of manifestation started with kshobh which stirred up a churning movement in the sphere of the Latent Motion. Activity revived and with it, the force got enlivenedand started its action towards manifestation. This line of action, though in perfect consonance with Divinity, appeared in its outer aspect to be some what different from it, since it had taken another course at manifestation. It may for that reason be termed as line of humanity, because of its close association with the formation of man.
Both the lines are now in action - the Divinity and the humanity, running side by side parallel to each other...
Now since both have come down from one great God - the Absolute - the humanity too, like Divinity, was in purest state. The force of activity in it was but nominal at the time or it was so to say in a sleepy state. The jerks caused by actions and counter actions began to stir up a sort of wakefulness and variations and contradictions began to come to view. Heat and cold made their diverse way, promoting formations. All these things entered into the composition of man and he became a conglomeration of all things in existence.
All that we have now to do is to bring them back again into their original state, or in other words, to restore them to a state of poise and tranquility so as to keep the link with Divinity. The only way to accomplish it is by introducing moderation into them, and we do the same in Sahaj Marg, the Natural Path of Realisation.
సృష్టి ఉనికిలోనికి రాక పూర్వం ఆస్తిత్వంలో ఉన్నది కేవలం ఒక్కటే ఒక్కటి - అదే దివ్యత్వం, తన మూల స్థితిలో ఉన్న దివ్యత్వం మాత్రమే ఉండేది; అందులో ప్రతీదీ తత్త్వ రూపంలో (బీజరూపంలో) నిక్షిప్తమై ఉండేది. నిద్రాణమై యున్న కదలిక పరిధిలో క్షోభ్ మొదలైన తరువాత అక్కడ ఒకరకమైన మథనం లాంటి ప్రక్రియ ప్రారంభమై సృష్టి బహిర్గతంవడం ప్రారంభమయ్యింది. దానితో క్రియాశీలత ప్రారంభమయ్యింది, శక్తికి ప్రాణం వచ్చినట్లయ్యింది , సృష్టి వ్యక్తమయ్యే దిశలో క్రియలు ప్రారంభమయ్యాయి. ఈ దిశలో జరిగే ప్రక్రియ దివ్యత్వంతో శ్రుతిలో ఉన్నప్పటికీ కూడా, బయటకు మాత్రం ఒక రకంగా భిన్నంగా ఉంది, ఎందుకంటే ఈ ప్రక్రియ మరో విధంగా వ్యక్తమవడం వల్ల. ఆ కారణం చేతనే ఈ ధోరణిని మానవాళికి సంబంధించిన ధోరణి అనవచ్చు; ఎందుకంటే ఈ ధోరణి మనిషి తయారయ్యే ప్రక్రియకు దగ్గరగా ఉంది కాబట్టి.
ప్రస్తుతం రెండు ధోరణులు క్రియాశీలకంగా ఉన్నాయి - దివ్యత్వము, మానవాళి - ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ప్రయాణిస్తున్నాయి .. .
ఇప్పుడు, రెండూ ఒకే మూలం నుండి అంటే ఆ పరతత్త్వం నుండే దిగివచ్చినందుకు, మానవాళి కూడా దివ్యత్వం లాగే చాలా పరమ శుద్ధ స్థితిలో ఉండేది. క్రియాశీలక శక్తి అందులో నామమాత్రంగా ఉండేది, అంటే బీజరూపంలో నిద్రాణ స్థితిలో ఉండేది. అక్కడ జరిగిన క్రియలు, ప్రతిక్రియాల వల్ల కలిగిన కుదుపుల వల్ల జాగరుదావస్థలో ఒకరకమైన కలవరం రేపడం మూలాన, వైవిధ్యాలు, వైరుధ్యాలు కనిపించడం మొదలయ్యాయి. వేడి, చల్లదనం వైరుధ్య మార్గాలు అవలంబించడం వల్ల, రూపాలు ఏర్పడటం ప్రారంభమయ్యింది. ఇవన్నీ మనిషి తయారీలో ప్రవేశించాయి; ఆ విధంగా సృష్టిలో ఉండే వస్తువులన్నిటి సమిష్టి ఫలితంగా ఏర్పడ్డాడు మనిషి.
ఇప్పుడు మనం చేయవలసిందల్లా, వీటన్నిటినీ మళ్ళీ ఆ మూల స్థితికి తీసుకురావడమే; మరోలా చెప్పాలంటే, వాటిని సమత్వ స్థితికి లేక ప్రశాంతమైన స్థితికి పునరుద్ధరించవలసి ఉంది; ఆ విధంగా దివ్యత్వంతో సంపర్కాన్ని కొనసాగించగలుగుతాం. వీటిలో మితాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా మాత్రమే దీన్ని సుసాధ్యం చేయవచ్చు; సరిగ్గా అదే మనం సహజ మార్గం లేక ప్రకృతి సిద్ధమైన సాక్షాత్కార పథంలో చేసేది.
dhanyavaadaalu krishna rao gaaru !!
రిప్లయితొలగించండి