బాబూజీ సందేశమాలిక 19
యోగాశ్రమ ప్రారంభం - చెన్నపట్టణ
(20 ఫిబ్రవరి 1972)
Opening of Yogashram, Chennapatna
(20 February 1972)
It is very easy to talk about creation but as to what part we have to play in it remains always silent. They look to others and blame that they are not doing their duty well, but they do not peep into themselves to realise what they have to do to others. They are mostly prepared to blame the Divinity as to why there are so many miseries and troubles in the world. They do not think what part they have played for the good of the world. They never think that they are spoiling the world themselves, and are creating complexities in the real flow of Nature. The thinking has become so rough that they always add their own pure thoughts in the span of Nature. Complexities after complexities are there and it is the creation of the human brain.
సృష్టిని గురించి మాట్లాడటం చాలా తేలిక, కానీ మనం పోషించవలసిన పాత్ర విషయానికొస్తే మాత్రం మౌనంగా ఉండిపోతాం. ఇతరులను చూస్తూ వాళ్ళు వాళ్ళ ధర్మాలను సరిగ్గా నిర్వర్తించడం లేదని నిందిస్తూ ఉంటారు, కానీ తమలో తాము తొంగి చూసుకొని వాళ్ళు ఇతరుల పట్ల చేయవలసినదాన్ని గుర్తించరు. వాళ్ళు కేవలం ఈ ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఉన్నందుకు ఆ దైవాన్ని నిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ ప్రపంచంలో చేయవలసిన మంచి కోసం వాళ్ళు ఏమి చేశారన్నదాని గురించి అసలు ఆలోచించరు. వాళ్ళే ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నారన్న సంగతిని వాళ్ళు గుర్తించారు. ప్రకృతి ప్రవాహానికి అడ్డుపడే జటిల పరిస్థితులను సృష్టిస్తున్నది వాళ్ళేనని అర్థం చేసుకోరు. వాళ్ళ ఆలోచన ఎంత కరుకుగా తయారయ్యిందంటే ప్రకృతిలోకి వాళ్ళ అశుద్ధమైన ఆలోచనలన్నీ ప్రవేశపెడుతున్నారు. జటిల తత్త్వాల మీద జటిల తత్త్వాలు సృష్టిస్తున్నారు, ఇవన్నీ మనిషి మెదడు లోనుండి వస్తున్నవే.
ఇంతగా భ్రష్టు పట్టించాం.... మార్పు రావాలి... వస్తున్నది అని పూజ్య దాజీ హామీ !!
రిప్లయితొలగించండి